గుంటూరులో మరో కీచక పర్వం

Auto Driver Molestation On Girl In Guntur - Sakshi

బాలికను బంధించి లైంగికదాడికి పాల్పడ్డ ఆటో డ్రైవర్‌

తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించిన బాలిక

ప్రియుడు గతంలో లైంగిక దాడి చేసినట్లు ఫిర్యాదు

నిందితులను అరెస్టు చేసిన పోలీసులు  

గుంటూరుఈస్ట్‌: గుంటూరు నగరంలో మరో కీచకపర్వం చోటుచేసుకుంది. ప్రియుడి కోసం పెద్దలను కాదని ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలికకు ఓ ఆటో డ్రైవర్‌ మాయమాటలు చెప్పి బంధించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రియుడు కూడా గతంలో లైంగికదాడికి పాల్పడినట్లు వెల్లడైంది. నగరంలోని లాలాపేట పోలీస్‌స్టేషన్‌లో ఈస్ట్‌ డీఎస్పీ కండె శ్రీనివాసులు, ఎస్‌హెచ్‌ఓ మురళీకృష్ణ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. లాలాపేట పోలీసు స్టేషన్‌ పరిధిలో నివసించే బాణావత్‌ గోపీనాయక్‌ (21) తన ఇంటి సమీపంలో నివసించే 17 ఏళ్ల బాలికతో రెండేళ్లుగా స్నేహంగా మెలిగాడు.

బాలిక తల్లిదండ్రులు గుర్తించి ఇద్దరినీ హెచ్చరించారు. దీంతో ఇద్దరూ ఇళ్ల నుంచి పారిపోయే పథకం వేసుకున్నారు. బాలిక బ్యాగ్‌లో బట్టలు సర్దుకుని గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇది గుర్తించిన బాలిక తల్లిదండ్రులు గోపీనాయక్‌ను, ఆయన తల్లిదండ్రులను నిలదీశారు. ఆ సమయంలో బాలిక గోపీనాయక్‌కు ఫోన్‌ చేసి తాను భాస్కర్‌ థియేటర్‌ పక్క వీధిలో ఉన్నానని, అక్కడకు రావాలని కోరింది. దీంతో బాలిక తల్లిదండ్రులు, గోపీనాయక్, అతని తల్లిదండ్రులు అక్కడకు వెళ్లారు. అప్పటికే ఆటోలో ఉన్న బాలిక వారిని చూసి అక్కడి నుంచి పారిపోయింది.

ఆటోడ్రైవర్‌ మహమ్మద్‌ రఫీ ఈ వ్యవహారాన్ని గమనించి కొంత సమయం ఇస్తే గోపీనాయక్‌ను తీసుకొచ్చి ఇద్దరికీ పెళ్లి చేస్తానని నమ్మించాడు. బాలికను నెహ్రునగర్‌ 7వ లైనులో తన నివాసం సమీపంలోని ఓ పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి, అర్ధరాత్రి బాలికపై లైంగిక దాడిచేశాడు. శుక్రవారం ఉదయం బాలిక తప్పించుకుని తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చింది. వారు బాలికను తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాలికను పోలీసులు విచారించగా ప్రియుడు గోపీనాయక్‌ గతంలో మూడు సార్లు లైంగిక దాడి చేసినట్లు చెప్పింది. దీంతో పోలీసులు ఆటో డ్రైవర్‌ రఫీ, గోపీనాయక్‌పై ఫోక్సో కేసులు నమోదు చేశారు. ఆటోడ్రైవర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top