అక్క మొగుడే కాకుండా మరోయువకుడు? | Another Twist In Molestation On Girl Case Prakasam | Sakshi
Sakshi News home page

లైంగిక దాడిలో మరో యువకుడు?

Jul 5 2018 12:33 PM | Updated on Jul 23 2018 8:51 PM

Another Twist In Molestation On Girl Case Prakasam - Sakshi

ఒంగోలు: ఏడో తరగతి చదువుకునే 12 సంవత్సరాల బాలికపై అక్క మొగుడే కాకుండా మరో యువకుడు కూడా లైంగికదాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతోంది. ఒంగోలు టూటౌన్‌ పరిధిలో ఈనెల 28న బాలికపై బావ.. అత్యాచారానికి ఒడిట్టాడనే విషయం వెలుగులోకి రావడం, పోలీసులు నిందితుడ్ని కటకటాల వెనక్కు పంపడం తెలిసిందే. అయితే ఈ ఘటనలో బాధితురాలి తల్లి, సోదరితోపాటు మైనర్‌ కూడా.. బావతోపాటు మరో వ్యక్తిపైన ఆరోపణలు చేసినట్లు సమాచారం. మరో యువకుడు జనవరి నెలలోనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై చైల్డ్‌లైన్‌ ప్రతినిధి, మహిళా కమిషన్‌ సభ్యురాలు, పోలీసులు వారివద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. తొలుత బాలికకు పోలీసులంటే ఉన్న భయంతో అన్ని విషయాలు వివరించలేకపోయిందని బంధువులు చెబుతున్నారు.

ఈ వ్యవహారంపై ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు స్పందించారు. బాలిక కుటుంబీకుల తాజా ఆరోపణల వ్యవహారం తమ దృష్టికి రావడంతోనే తాము విచారణ ప్రారంభించామన్నారు. మొదట కేవలం బావపై మాత్రమే ఫిర్యాదు చేశారని, తాజాగా బాలిక చెప్పిన మరో యువకుడి వ్యవహారంపై కూడా దృష్టి సారించామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement