పగ బుల్లెట్ల రూపంలో దూసుకొచ్చింది..!

Akali Dal Leader Dalbir Singh Shot Dead, leg Chopped Off - Sakshi

చంఢీగడ్‌ : గురుదాస్‌పూర్ శిరోమణి అకాలీదళ్ యూనిట్ ఉపాధ్యక్షుడు దల్బీర్ సింగ్ (55)ను దారుణ హత్యకు గురయ్యారు. ఓ కూలీ మనిషి విషయంలో ఘర్షణ తలెత్తడంతో పౌల్ట్రీ నిర్వాహకుడు బల్విందర్ సింగ్ (55) మరికొంతమందితో కలిసి దల్బీర్‌సింగ్‌ను కాల్చి చంపారని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో నిందితులు బల్విందర్ సింగ్ (55), అతని కుమారులు మేజర్ సింగ్ (25), మన్‌దీప్ సింగ్ (24) తో పాటు మరో ఆరుగురు దల్బీర్ ఇంట్లోకి చొరబడ్డారని పోలీసులు తెలిపారు.

తొలుత దల్బీర్‌ కుంటుంభ సుభ్యులపైకి డజనుకుపైగాబుల్లెట్లను పేల్లి వాళ్లందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. ఈక్రమంలోనే దల్బీర్‌ను కాల్చి చంపి.. అతని కాళ్లను ముక్కలుగా నరికివేశారు. కూలీ మనిషి విషయంలో తలెత్తిన గొడవలో మాజీ సర్పంచ్‌ అయిన దల్బీర్‌ కలుగజేసుకుని పరిష్కరించాడని.. అయితే, బల్విందర్‌ మాత్రం.. దల్బీర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడని గ్రామస్తులు పేర్కొన్నారు. తొమ్మిది మంది నిందితులపై  కేసు నమోదు చేశామని బటాలా ఎస్‌ఎస్‌పి ఒపింద్రజీత్ సింగ్ ఘుమ్మన్ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top