లైంగిక దాడి నిందితుడి అరెస్టు

19 Year Old Boy Arrested By The Guntur Police For Raping Years Girl - Sakshi

ఫాస్ట్‌ట్రాక్‌లో దర్యాప్తు పూర్తి చేస్తాం

ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ

గుంటూరు: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని గుంటూరు అర్బన్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణంలోని అర్బన్‌ కాన్ఫరెన్స్‌ హాలులో అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ వివరాలు వెల్లడించారు. గుంటూరులోని రామిరెడ్డి నగర్‌ 7వ లైనులో ఓ వివాహిత తన ఐదేళ్ల కుమార్తెతో కలసి నివాసం ఉంటూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. యూకేజీ చదువుతున్న  ఆమె కుమార్తె(5) ఈ నెల 11వ తేదీ  సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో బాలిక ఇంటి ముందు  ఆడుకుంటుండగా  19 ఏళ్ల నిందితుడు బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లి వెంటనే నగరంపాలెం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.

బాలికను చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని శనివారం చుట్టుగుంట సెంటర్‌లో అదుపులోకి తీసుకుని విచారించగా లైంగికదాడికి పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ,అట్రాసిటీ, పోక్సో యాక్ట్‌తో పాటుగా సెక్షన్‌ 376(2)ఐ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, ఆపదలో ఉన్న వారు డయల్‌ 100తో పాటుగా 86888 31568 వాట్సాప్‌ నంబరును సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ కోరారు. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాల మేరకు ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ పర్యవేక్షణలో ఫాస్ట్‌ట్రాక్‌లో దర్యాప్తు పూర్తి చేసి 15 రోజుల్లో చార్జిషీటును  దాఖలు చేస్తామని  ఎస్పీ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top