14 ఏళ్ల బాలికను అతికిరాతకంగా.. | 14 Years Girl Found Murdered In Uttarpradesh | Sakshi
Sakshi News home page

14 ఏళ్ల బాలికను అతికిరాతకంగా..

Sep 2 2019 1:17 PM | Updated on Sep 2 2019 2:21 PM

14 Years Girl Found Murdered  In Uttarpradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

దారుణ పరిస్థితుల్లో.. కళ్లు బయటికి లాగిన స్థితిలో ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు.

లక్నో : ఓ మైనర్‌ బాలికను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జలాన్ జిల్లాలోని అటా ప్రాంతంలో నివసిస్తున్న 14 ఏళ్ల బాలిక శనివారం సాయంత్రం పని మీద బయటికి వెళ్లింది. రాత్రి వరకు తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంటి పక్కన ఉండే వ్యక్తిని అనుమానితుడిగా అరెస్ట్‌ చేశారు. కాగా ఆదివారం నిర్మానుష్య ప్రదేశంలో బాలిక విగత జీవిగా కనిపించింది. దారుణ పరిస్థితుల్లో.. కళ్లు బయటికి లాగిన స్థితిలో ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు.

అయితే హత్య చేసేముందు బాలిక ఆత్యాచారానికి గురైందా అన్న విషయం తేలాల్సి ఉంది. నిందితుడిపై ఇప్పటికే మైనర్‌ బంధువును వేధించాడనే ఆరోపణలతో 376 సెక్షన్‌ కింద కేసు ఫైల్‌ అయ్యిందని, అరెస్టు చేసిన వ్యక్తిని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి పూర్తి వివరాలు వెల్లడించలేమని, పోస్టుమార్టం నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement