టీటీడీలో అన్యమత ఉద్యోగులకు ఊరట | High court stay on TTD terminate 45 non-Hindu employees | Sakshi
Sakshi News home page

టీటీడీలో అన్యమత ఉద్యోగులకు ఊరట

Feb 21 2018 3:29 PM | Updated on Aug 31 2018 8:40 PM

High court stay on TTD terminate 45 non-Hindu employees  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీటీడీలో అన్యమత ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. అన్యమత ఉద్యోగస్తులను తొలగించవద్దని హైకోర్టు బుధవారం స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. కాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిధిలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న 45మంది అన్యమతస్తుల ఉద్యోగులను తొలగిస్తూ టీటీడీ జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలోనే టీటీడీ కౌంటర్‌ దాఖలు చేసింది.  ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న హైందవేతరులను ఎలా తొలగిస్తారని న్యాయస్థానం ఈ సందర్భంగా టీటీడీని ప్రశ్నించింది. తదుపరి కోర్టు ఉత్తర్వులు వెలువరించే వరకూ అన‍్యమతస్తుల తొలగింపుపై చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఆదేశం ఇచ్చింది.

కాగా 1989 నుంచి 2007 వరకు టీటీడీలో 37మంది అన్యమతస్తులు ఉద్యోగాలు పొందారు. అయితే 2007లో ఇకపై ఇలా జరగొద్దని టీటీడీ పాలకమండలి  తీర్మానం చేసింది. ఆ తర్వాత కూడా నకిలీ సర్టిఫికెట్లతో ఏడుగురు ఉద్యోగాల్లో చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement