రియల్టీకి టీఎస్‌–ఐపాస్‌ తరహా పాలసీ | TS-Ipass style policy for realty | Sakshi
Sakshi News home page

రియల్టీకి టీఎస్‌–ఐపాస్‌ తరహా పాలసీ

Dec 30 2017 3:03 AM | Updated on Dec 30 2017 10:20 AM

TS-Ipass style policy for realty - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో స్థిరాస్తి రంగ ప్రాజెక్ట్‌లకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేసేందు కు టీఎస్‌–ఐపాస్‌ తరహాలో ప్రత్యేక పాలసీని తీసుకురావాల్సిన అవసరముందని జోన్స్‌ లాంగ్‌ లాసల్లె (జేఎల్‌ఎల్‌), తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (ట్రెడా) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక తెలిపింది. తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ అభివృద్ధి అవకాశాలపై అధ్యయన నివేదికను విడుదల చేశాయి.

‘‘తెలంగాణ జీస్‌డీపీలో స్థిరాస్తి రంగం వాటా 13 శాతం. రాష్ట్రానికి ఆదాయంతో పాటూ ఉద్యోగ అవకాశాలనూ కల్పిం చే స్థిరాస్తి రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముందని కేవలం పాలసీలతో సరిపెట్టకుండా వాటి అమలు, రాయితీల మీద దృష్టిసారించాలని’’ జేఎల్‌ఎల్‌ హైదరాబాద్‌ ఎండీ సందీప్‌ పట్నాయక్‌ సూచించారు.

ఎలాంటి ఇబ్బందులు, ప్రలోభాలకు గురిచేయకుండా త్వరితగతిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) జారీ చేయాలని కోరారు. నాణ్యమైన నిర్మాణాలు చేసే డెవలపర్లకు ప్రోత్సాహకంగా పన్ను రాయితీలను కల్పించాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రిటైల్, కమర్షియల్‌ నిర్మాణాల ఎత్తులో నియంత్రణలను సవరించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement