కొటక్‌తో సిండికేట్‌ బ్యాంక్‌ జట్టు | Syndicate bank team with Kotak securities | Sakshi
Sakshi News home page

కొటక్‌తో సిండికేట్‌ బ్యాంక్‌ జట్టు

Jul 10 2018 12:38 AM | Updated on Jul 10 2018 7:46 AM

Syndicate bank team with Kotak securities - Sakshi

ప్రభుత్వ రంగ సిండికేట్‌ బ్యాంక్‌ తాజాగా తన కస్టమర్లకు ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ సేవలందించేందుకు కొటక్‌ సెక్యూరిటీస్‌తో జతకట్టింది. ఇందులో భాగంగా సేవింగ్స్‌/కరెంట్‌ అకౌంట్, డీమ్యాట్‌ అకౌంట్‌ను సిండికేట్‌ బ్యాంక్‌ ఆఫర్‌ చేస్తే, ట్రేడింగ్‌ అకౌంట్‌ను కొటక్‌ సెక్యూరిటీస్‌ అందిస్తుంది.

బ్యాంక్‌ ఈ 3 ఇన్‌ 1 ఖాతాను సిండ్‌ ట్రినిటీ ప్రొడక్ట్‌గా పేర్కొంది. కొత్తగా 3ఇన్‌1 అకౌంట్‌ను తెరవొచ్చని, లేదా పాత అకౌంట్‌కు డీమ్యాట్, ట్రేడింగ్‌ సేవలను జత చేసుకోవచ్చని సిండికేట్‌ బ్యాంక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవలహైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సిండికేట్‌ బ్యాంక్‌ జోనల్‌ హెడ్‌ (హైదరాబాద్‌) ఎస్‌.విజయకుమార్‌ సమక్షంలో బ్యాంక్‌ జీఎం (మార్కెటింగ్‌– బెంగళూరు) ఎస్‌.పి.శర్మ ఈ సిండ్‌ ట్రినిటీ ప్రొడక్ట్‌ను ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement