లాభాల ఓపెనింగ్‌ : మెటల్‌ రీబౌండ్‌ | Stockmarkets Opens With 150 Points Higher | Sakshi
Sakshi News home page

లాభాల ఓపెనింగ్‌ : మెటల్‌ రీబౌండ్‌

Mar 29 2019 9:27 AM | Updated on Mar 29 2019 9:53 AM

Stockmarkets Opens With 150 Points Higher - Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు  భారీ లాభాలతో ప్రారంభమైనాయి.అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో  సెన్సెక్స్‌ 170 పాయింట్లు జంప్‌ చేసి 38,715 వద్ద , నిప్టీ 49 పాయింట్లుఎగిసి 11618 వద్ద ట్రేడ్‌ అవుతోంది. దాదాపు అన్నిసెక్టార్లు లాభాల్లో ఉన్నాయి. ప్రధానంగా మెటల్‌, ఐటీ షేర్లు లాభాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కూడా లాభపడుతోంది. వేదాంతా, హిందాల్కో, నాల్కో, సెయిల్‌ తదితర మెటల్‌ షేర్లు బాగా లాభపడుతున్నాయి. ఐడియా షేర్‌ భారీగా లాభపడుతోంది.  మరోవైపు బ్యాంక్‌ నిఫ్టీ బలహీనంగా  ఉంది.

అటు డాలరు మారకంలో రుపీ తిరిగి ఫామ్‌లోకివచ్చింది. డాలరు మారకంలో 19 పైసలు ఎగిసి 69.15వద్ద కొనసాగుతోంది. గురువారం 42 పైసలు పతనమై 69.30వద్ద  రూపాయి ముగిసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement