ఆన్లైన్లో...చిలక్కొట్టుడు! | special story on credicard charges and family budget | Sakshi
Sakshi News home page

ఆన్లైన్లో...చిలక్కొట్టుడు!

Dec 5 2016 1:28 AM | Updated on Sep 4 2017 9:54 PM

ఆన్లైన్లో...చిలక్కొట్టుడు!

ఆన్లైన్లో...చిలక్కొట్టుడు!

చేతిలో డబ్బుల్లేవు. ఉన్న డబ్బులన్నీ బ్యాంకులోనే ఉన్నారుు. ఏటీఎంల నుంచి గానీ... బ్యాంకుల నుంచి గానీ విత్‌డ్రా చేసే పరిస్థితి లేదు. ఫలితం...

సినిమా టికెట్ల నుంచి పెట్రోలు దాకా మోతే...
ఫ్యామిలీ బడ్జెట్ తలకిందులు
సూపర్ మార్కెట్, హోటల్లోనూ బాదుడే
క్రెడిట్ కార్డుకే కాదు.. డెబిట్ కార్డులకూ తప్పని భారం
డిజిటల్ లావాదేవీలపై సర్వీస్ ట్యాక్సులు, సర్‌చార్జీలు
మరింత భారం కానున్న కుటుంబ బడ్జెట్

చేతిలో డబ్బుల్లేవు. ఉన్న డబ్బులన్నీ బ్యాంకులోనే ఉన్నారుు. ఏటీఎంల నుంచి గానీ... బ్యాంకుల నుంచి గానీ విత్‌డ్రా చేసే పరిస్థితి లేదు. ఫలితం... తప్పనిసరై, నిర్బంధంగా అంతా ఆన్‌లైన్‌కు మళ్లాల్సి వస్తోంది. కాకపోతే ఇంటర్‌నెట్ సౌకర్యం లేనివారు, అసలు నెట్ అంటే తెలియని వారు, మొబైల్‌లో నెట్ లేనివారు... ఉన్నా ఎలా వాడాలో తెలియనివారు మన దేశంలో కోకొల్లలు. వారంతా గతిలేక ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తుంటే... తెలిసినవారంతా విధిలేక ఇంటర్నెట్ ఆర్థిక లావాదేవీలవైపు మళ్లుతున్నారు. ఇదీ... వాస్తవ చిత్రం. ఇక ప్రభుత్వమేమో ఆన్‌లైన్‌వైపు మళ్లండంటూ విపరీతంగా ఊదరగొడుతోంది.

వాలెట్లు, ఆన్‌లైన్ బ్యాకింగ్ వ్యవస్థలు తమ ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఒక్కసారిగా 300%.. 500% పెరిగాయంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారుు. చేతిలో డబ్బుల్లేక అంతా నిర్బంధంగా నెట్ వైపు నడుస్తుంటే మరి లావాదేవీలు పెరక్క ఏం చేస్తాయనే సం దేహం ఎవరికై నా రావచ్చు. అది నిజమే కూడా!! సరే! ఇదంతా పక్కనబెడితే అసలు ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో చార్జీలెంత ఉంటారుు? ఇవేమన్నా నగదు మాదిరి ఇతరత్రా చార్జీల్లేకుండా ఉంటాయా? ప్రస్తుతానికై తే ప్రభుత్వం డిసెంబర్ 31 వరకూ అన్ని లావాదేవీలపైనా చార్జీల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కానీ సినిమా టికెట్ల నుంచి అంతా ఈ చార్జీల్ని వసూలు చేస్తూనే ఉన్నారు. అసలు కార్డు, ఆన్‌లైన్ లావాదేవీల్లో చార్జీలెలా ఉంటారుు? ఎవరెంత వసూలు చేస్తున్నారు? ఇంటి బడ్జెట్ ఎంత పెరుగుతుంది? ఇవే ఈ వారం ప్రాఫిట్ కథనాలు..

సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
మీరు సినిమాకు వెళ్దామనుకున్నారు. అక్కడికి వెళ్లి లైన్లో నిల్చుని టికెట్లు తీసుకునే ఓపిక లేదు. పెపైచ్చు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పుడు మీ దగ్గర డబ్బులు కూడా లేవు. సరే! ఆన్‌లైన్‌లో చూసుకుని ఏ ‘బుక్‌మై షో’ సైట్ ద్వారానో, లేక పేటీఎం ద్వారానో టికెట్లు బుక్ చేద్దామనుకున్నారనుకోండి. బుక్ మై షో చార్జీలు, సర్వీస్ చార్జీలు, ఇతరత్రా పన్నుల పేరిట ఒకో టికెట్‌పై రూ.20 నుంచి 40 వరకూ చెల్లించకతప్పదు.

పోనీ పెట్రోల్ పోరుుంచుకున్నారనుకోండి. రూ.150 పెట్రోల్ పోరుుంచుకుంటే నగదు రూపంలో రూ. 150 మాత్రమే కడతారు. కొన్ని కార్డులైతే బిల్లు మొత్తంలో 2.5 శాతాన్ని వసూలు చేస్తున్నారుు. చిత్రమేంటంటే డెబిట్ కార్డుతో చెల్లించినప్పుడు కూడా సర్‌చార్జీలు, సర్వీస్ చార్జీల పేరిట రూ.11.50 దాకా వదులుకోవాల్సి వస్తోంది. ఈ తరహా మోత డెబిట్ కార్డులపై 0.75-1 శాతం, క్రెడిట్ కార్డులపై 2.5 శాతం దాకా ఉంటోంది. ఇలా డెబిట్, క్రెడిట్ కార్డులతో జరిపే లావాదేవీలపై ఉండే అదనపు వ్యయాల్ని ప్రస్తుతం వ్యాపారులు భరించాల్సి వస్తోంది. వారేమో వీటిని చాలా సందర్భాల్లో కస్టమర్లపైనే వేస్తున్నారు. ఈ అదనపు చార్జీల్ని ఎత్తివేయాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. ఇప్పటిదాకా అతీగతీ లేదు. నగదు రహిత లావాదేవీలంటూ అంతా ఆన్‌లైన్లో చేస్తూ పోతే ఇప్పుడున్న ఛార్జీల ప్రకారం సామాన్యుడి బడ్జెట్ కుదేలవక తప్పదు.

నిత్యావసరాలపైనా మోతే!!
పీవోఎస్ మెషీన్లు, ఆన్‌లైన్ చెల్లింపుల వెసులుబాటు ఉండే చిన్న వ్యాపారస్తుల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి కొన్ని నగరాల్లో పండ్లు, కూరగాయలకు కూడా డిజిటల్ చెల్లింపులు చేయాలంటే సూపర్‌మార్కెట్‌కు వెళ్లాలి. అక్కడ వివిధ చార్జీల రూపంలో 5-30 శాతం అధికంగా కట్టడానికి సిద్ధపడాలి. దీనికి తోడు మాల్ లేదా సూపర్ మార్కెట్ దాకా వెళ్లేందుకు, అక్కడ పార్కింగ్ చేసేందుకు ఇంకాస్త ఖర్చవుతుంది. ఒకవేళ సదరు సూపర్‌మార్కెటు మీకు కావాల్సిన సాధారణ పాల ప్యాకెట్లను అమ్మకుండా టెట్రా ప్యాక్‌లు మాత్రమే అమ్ముతోందనుకోండి. అప్పుడు మీరు మరో 50 శాతం ఎక్కువ పెట్టే వాటిని కొనుక్కోవాలి. దీంతో రోజుకో లీటరు చొప్పున నెలకు సుమారు రూ.1,200 పైచిలుకు అయ్యే పాల బిల్లు ఏకంగా రూ.1,800కు పెరుగుతుంది.

కార్డులతో చెల్లింపులు జరిపే వారికి డిస్కౌంట్లనో, పంచదార వంటి ఉత్పత్తులు ఉచితమనో ఆయా సూపర్ మార్కెట్లు ఊరించినా... తత్సంబంధిత ఖర్చులన్నింటితో పోలిస్తే చాలా సందర్భాల్లో ఇంటికి దగ్గర్లోని కిరాణ దుకాణాదారు కన్నా ఎక్కువే అవుతుంది. ఇలా సూపర్‌మార్కెట్లు కాకుండా ఆన్‌లైన్లో కూడా నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంది. దీనివల్ల రవాణా ఖర్చులు, సమయం ఆదా అరుునప్పటికీ.. కనీస ఆర్డరు ఇంత ఉంటే గానీ (ఉదాహరణకు రూ. 500, రూ. 1,000) ఉచిత డెలివరీ లభించడం లేదు. ఒకవేళ అంతకన్నా తక్కువ మొత్తానికి కొనుగోళ్లు చేస్తే అదనంగా రూ.25-50 డెలివరీ చార్జీల కింద చెల్లించాల్సి ఉంటోంది. ఏ రారుుతో కొట్టుకున్నా ఒకటే కదా!!

ప్రయాణమంటే అంతే!!
మీరోసారి గమనించి చూడండి! లైన్లో నిల్చుని తీసుకున్న రైలు టికెట్ కన్నా... ఆన్‌లైన్లో తీసుకునే టికెట్ ఖరీదు కాస్త ఎక్కువ. ఎందుకంటే సర్వీసు ఛార్జీలు, బ్యాంకు ఛార్జీలు అన్నీ జతరుుపోతారుు. ప్రస్తుతం డిసెంబరు 31వరకూ వీటిని తొలగించినా... ఆ తరవాత మళ్లీ ఠంచనుగా ప్రత్యక్షమరుుపోతారుు. విమానం టికెట్లదీ అదే పరిస్థితి. క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే టికెట్‌కు రూ.150 చొప్పున అదనంగా చెల్లించాలి. డెబిట్ కార్డరుుతే ఇది సగానికి తగ్గుతుంది. ఈ లెక్కన చూస్తే బస్సులే కాస్త నయం. అక్కడ అదనపు బాదుడుండదు.

ఇక చాలా మంది లోకల్ బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్నప్పటికీ... ఆయా స్టేషన్లు, బస్ స్టాప్‌లు చేరుకోవడానికి మళ్లీ ఆటోలు, ట్యాక్సీల్లాంటి వాటిని ఆశ్రరుుంచాల్సి వస్తోంది. ముంబై వంటి నగరాల్లో ఒక నాలుగు కిలోమీటర్ల దూరానికి ఆటో, ట్యాక్సీ చార్జీలు రూ.49-59 గా ఉంటున్నారుు. అదే యాప్ ఆధారిత ట్యాక్సీని గానీ తీసుకుంటే ఈ చార్జీలు రెట్టింపై రూ.100 దాకా ఉంటున్నారుు. అరుుతే, తక్కువ దూరాల కన్నా ఎక్కువ దూరాాల ప్రయాణాలకు  ఇలాంటి యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు కాస్త చౌకగానే ఉంటున్నారుు.

కాకా హోటల్లో కార్డు కష్టం!
చిన్నపాటి హోటళ్లు, మెస్‌లలో భోజనం చేస్తే రూ.70-80 సరిపోతోంది. కానీ అదే కార్డులపై చెల్లింపులు జరిపే వీలున్న ఒక మోస్తరు రెస్టారెంట్‌లకు వెడితే ఈ ఖర్చు రూ.200కు తగ్గదు. కనీస బిల్లు మొత్తం రూ.100 కన్నా తక్కువగా ఉంటే ఈ హోటళ్లు కార్డులను యాక్సెప్ట్ చేయవు. దీంతో చిన్నపాటి హోటల్‌లో టీ లేదా కాఫీ, స్నాక్స్ తీసుకుంటే రూ.30-40 అయ్యే ఖర్చు కాస్తా... డిజిటల్ పేమెంట్స్‌కు వీలున్న రెస్టారెంట్‌లో కచ్చితంగా రూ.100 వరకూ అవుతుంది. ఫుడ్ ఆర్డరింగ్ యాప్స్ కూడా ఇపుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నారుు. కానీ ఇవి కూడా ఉచిత డెలివరీ చేయాలంటే కనీసం రూ.150-200 మేర బిల్లింగ్ ఉండాలంటున్నారుు. లేదంటే డెలివరీ చార్జీలుగా రూ.20- 40 వడ్డిస్తున్నారుు.

కార్డే కదా అని గీకితే...
పెద్ద నోట్లను రద్దు చేయటంతో... క్రెడిట్ కార్డును పర్సులో ఉంచుకుని కూడా నగదు వాడటానికే ఇష్టపడ్డవారు ఇప్పుడిక తప్పనిసరిగా ఆ కార్డులు బయటకు తీయాల్సి వస్తోంది. వీరిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా... డిసెంబర్ 31 వరకూ ఎలక్ట్రానిక్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలూ ఉండవని ప్రకటించింది. మరి ఆ తరవాత కూడా క్రెడిట్ కార్డు వాడితే ఏమవుతుంది? ఇటీవల బ్యాంకింగ్ కోడ్‌‌స అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) ఒక నివేదికలో చెప్పిన మాటేంటంటే... ఉచిత క్రెడిట్ కార్డు అనేది మిథ్య అని. అందుకే కార్డు తీసుకునే ముందుగానీ, తీసుకుని ఉంటే ఇప్పుడుగానీ... బ్యాంకు చెప్పిన నియమ నిబంధనల్ని జాగ్రత్తగా చదవాలి. అందులోనే ఉంటుంది... ఆ బ్యాంకు ఏఏ లావాదేవీలపై ఎంతెంత చార్జీలు విధిస్తుందో. నిజం చెప్పాలంటే క్రెడిట్ కార్డుకు సంబంధించి ఈ నియమ నిబంధనల పత్రమే అత్యంత కీలకమైన డాక్యుమెంటు. దీని ఆధారంగా అసలు ఏఏ చార్జీలు ఎంతెంత ఉంటాయో తెలియజెప్పే ప్రయత్నమే ఇది...

క్రెడిట్ కార్డు చార్జీలు...


ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నారుు. సాధారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులకు పైన పేర్కొన్న ఛార్జీలన్నీ వర్తిస్తున్నారుు.

కొన్ని బ్యాంకులు మాత్రం వార్షిక ఫీజును పూర్తిగా మినహారుుస్తున్నారుు. కొన్నరుుతే కస్టమరుకార్డుపై ఖర్చు చేసిన మొత్తాన్ని బట్టి ఈ ఫీజును తొలగిస్తున్నారుు.
చాలా కార్డులు ప్రతి నెలా నిర్దేశిత మొత్తం వరకూ పెట్రోలు, డీజిల్ కొనుగోళ్లపై సర్‌ఛార్జిని తొలగిస్తున్నారుు.

కనీస లావాదేవీ అంటే ఎలా?
చేతిలో డబ్బుల్లేవు కదా అని కార్డు పట్టుకుని బయల్దేరాడు అశోక్. దగ్గర్లోని పతంజలి స్టోర్‌కు వెళ్లి తేనె, రెండు సబ్బులు తీసుకుందామనుకున్నాడు. మొత్తం బిల్లు రూ.230 అరుుంది. బిల్లు చెల్లించడానికి కార్డు అందజేశాడు. కానీ... దాన్ని ఆ దుకాణ యజమాని తిరస్కరించాడు. ‘సార్! కనీసం రూ.300 బిల్లు చేస్తేనే కార్డుపై తీసుకుంటాం. లేకుంటే క్యాష్ ఇవ్వాల్సిందే’ అని చెప్పాడు. అశోక్‌కు చిరాకొచ్చింది. నీ బిల్లు కోసం నాకు అక్కర్లేని వస్తువులు కొనలేను కదా!! అంటూ బయటికొచ్చేశాడు. వచ్చి... ట్వీటర్లో అదే విషయాన్ని ట్వీట్ చేశాడు.

నిజమే!! ఒక్క అశోక్ విషయంలోనే కాదు. చాలామంది విషయంలో ఇపుడు ఇదే జరుగుతోంది. ఈ-కామర్స్‌లో అరుుతే ఉచిత డెలివరీ కావాలంటే కనీస షాపింగ్ మొత్తం ఉంటుంది. ఇక సూపర్ మార్కెట్లు, దుకాణాలు, చిన్న చిన్న హోటళ్లలో అరుుతే కనీస మొత్తానికి బిల్లింగ్ చేస్తేనే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు తీసుకుంటారు. దానికోసం అవసరం లేనివి కూడా కొనాలా? అనేదే వినియోగదారు ప్రశ్న.

ఈ అంశాలు గమనించండి..!
ఫ్రీ కార్డ్ అంటున్నారా?

ఏదైనా బ్యాంకు మీకు ఉచితంగా క్రెడిట్ కార్డు ఇస్తున్నామని చెబితే దానర్థం జారుునింగ్ ఛార్జీలను, తొలి ఏడాది వార్షిక ఛార్జీలను తొలగిస్తున్నట్లు లెక్క. పక్కాగా జీవిత కాల వార్షిక రుసుము తొలగిస్తున్నట్లు చెబితే తప్ప... అది ఫ్రీకార్డ్ కానే కాదు. సిటీ బ్యాంక్ వంటివి కొన్ని నిబంధనలకు లోబడి లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డులు అందిస్తున్నారుు.

కనీస మొత్తం చెల్లిస్తే అంతే!
మీరు గనక మీకు వచ్చిన బిల్లులో కనీసం ఎంత చెల్లించాలో అంతే చెల్లించి ఊరుకున్నారనుకోండి. మీ అప్పు ఎప్పటికీ తీరదు. ఎందుకంటే మిగిలిన మొత్తంపై విధించే వడ్డీలు దారుణంగా ఉంటారుు. అందుకే వాడిన మొత్తం బిల్లును ఆ నెలలోనే చెల్లించేసి... మళ్లీ కొత్తగా మరుసటి నెల వాడుకుంటే మంచిది.

పరిమితి దాటారో..!
ప్రతి కార్డుకూ ఒక పరిమితి అంటూ ఉంటుంది. మీరు గనక ఎప్పుడైనా ఆ పరిమితిని దాటి వాడేశారంటే... ఓవర్ డ్రాఫ్ట్ ఛార్జీలు, జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.

బిల్లు చెల్లించకపోతే...
నెలనెలా మీకు బిల్లు వచ్చినపుడు దాన్లో చెల్లించాల్సిన గడువు తేదీ ఉంటుంది. ఆ తేదీని జాగ్రత్తగా గుర్తుంచుకుని అప్పటిలోగానే బిల్లు చెల్లించేయాలి. అలా చేయకపోతే పెనాల్టీ, వడ్డీ కలిసి తడిసి మోపెడవుతుంది.

బయటి ప్రాంతాల చెక్కులిస్తే..
మీకు ఎస్‌బీఐ కార్డుంది. బిల్లు చెల్లించే సమయానికి మీరు ఏ ముంబాయో వెళ్లి... అక్కడ గనక చెక్కుపై చెల్లించారనుకోండి. మీ చెక్కు హైదరాబాద్‌ది కనక అదనపు ఛార్జీలవుతారుు. అలాకాక హైదరాబాద్‌లో ఉండి మీరు వేరే ప్రాంతపు చెక్కు ఇచ్చినా ఈ ఛార్జీలుంటారుు. ఇక ఈ చెక్ బౌన్సరుుతే జరిమానాలు, పెనాల్టీలు, ఆలస్య రుసుములు అన్నీ కలిసి భరించలేని స్థితికి తీసుకెళతారుు.

నగదు తీయకుంటేనే మంచిది...
ప్రతి క్రెడిట్ కార్డుపైనా పరిమితి ఉన్నట్టే దాన్లో నగదు విత్‌డ్రా చేసుకోవటానికి కూడా కొంత పరిమితి ఉంటుంది. ఉదాహరణకు రూ.2 లక్షలు గనక కార్డు పరిమితి అరుుతే అందులో 30 శాతం... అంటే రూ.30వేల వరకూ నగదును ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే లావాదేవీల చార్జీలతో పాటు నగదుపై వడ్డీ కూడా భారీగానే ఉంటుంది. అందుకని నగదు తీయకుంటేనే బెటర్.

దేశీయంగా వినియోగదారులు జరిపే లావాదేవీల్లో పరిమాణంపరంగా 95 శాతం, విలువపరంగా 65 శాతం నగదు రూపంలోనే ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నారుు. ఇప్పటికీ భారత్ ప్రధానంగా నగదు లావాదేవీలపైనే ఎక్కువగా ఆధారపడిన దేశంగా పేర్కొంటున్నారుు. ఇలాంటి పరిస్థితుల్లో చెలామణీలోని నగదులో 86 శాతం పైగా వాటా ఉన్న పెద్ద నోట్లను ఎకాయెకిన రద్దు చేసి పారేయడంతో సామాన్యుల పరిస్థితి గందరగోళంగా మారిం ది. చేతిలో నోటు లేక, బ్యాంకుల్లో ఉన్నవి అందక తప్పనిసరై నిర్బంధంగా డిజిటల్ లావాదేవీలవైపు మళ్లక తప్పడం లేదు. ఆన్‌లైన్ లావాదేవీలు అత్యంత సులభతరమైనవంటూ ఊదరగొడుతున్నవారు.. నగదు లావాదేవీలతో పోలిస్తే ఇవి మరింత ఖరీదైనవన్న సంగతి మాత్రం చెప్పడం లేదు. ప్రస్తుతానికి కొద్ది రోజుల పాటు ఏటీఎం లావాదేవీల చార్జీలను రద్దు చేసినప్పటికీ .. పెట్రోల్ బంకులు మొదలుకుని సినిమా టికెట్ల దాకా డిజిటల్ మాధ్యమంలో చేసే వివిధ లావాదేవీలకు చార్జీలు కొనసాగుతూనే ఉన్నారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement