Family budget
-
International Womens Day 2024: ఆర్థిక స్వాతంత్య్రం అంటే?
స్త్రీలు సంపాదనపరులైతే ఏమవుతుంది? ఆర్థికంగా సమృద్ధి సాధిస్తే ఏమవుతుంది? తమ జీవితాలపై అధికారం వస్తుంది. కీలక నిర్ణయాలప్పుడు గొంతెత్తే ఆత్మవిశ్వాసం వస్తుంది. తమకు ఏ హక్కులు రక్షణ ఇస్తాయో ఎరుక కలుగుతుంది. స్త్రీ ఇవన్నీ కుటుంబ సంక్షేమానికే వెచ్చిస్తుంది. స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం ఇంటా, బయటా స్త్రీ, పురుషుల సమ భాగస్వామ్యాన్ని ప్రతిపాదిస్తుంది. కాని స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రానికి ఇంకా ఎంతో చైతన్యం కావాలి. స్త్రీలు సాధికారత పొందటం అంటే ఏమిటి? పరాధీనత నుంచి బయటపడటమే. అంటే? మరొకరు తనను పోషించే స్థితి నుంచి బయటపడటమే. తండ్రి, భర్త, కుమారుడి సంపాదన వల్ల మాత్రమే జీవితం గడుస్తూ ఉంటే కనుక ఆ పరాధీనత నుంచి బయట పడటం. అంటే బంధం నుంచి బయటపడటం కాదు. స్థితి నుంచి మాత్రమే. స్త్రీలు సాధికారత ఎప్పుడు పొందుతారంటే ఆర్థికంగా వారు స్వేచ్ఛ పొందినప్పుడు. స్త్రీలకు సామాజికంగా, కుటుంబపరంగా హక్కులు ఉంటాయి. అయితే ఆ హక్కులను దక్కించుకోవాలంటే వారికి ఆర్థిక ఆత్మవిశ్వాసం ఉండాలి. పుట్టుక నుంచే స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలనే భావన ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచే తీసివేయడం నేటికీ జరుగుతోంది. ‘ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టడానికి’ అనుకునే తల్లిదండ్రులు, భర్త సంపాదన వల్ల మాత్రమే ఆమె బతకాలనుకునే తల్లిదండ్రులు ఆమె చదువును నిర్లక్ష్యం చేయడం గ్రామీణ భారతంలో నేటికీ జరుగుతూనే ఉంది. ఆడపిల్లకు ఆస్తిపాస్తులు ఇచ్చినా చదువు వల్ల వచ్చే, ఆమెకై ఎంచుకునే ఉపాధి నుంచి వచ్చే సంపాదన కలిగించే ఆత్మవిశ్వాసం వేరు. స్త్రీలను ‘అదుపులో ఉంచడం’ అంటే వారిని ఆర్థిక వనరుల నుంచి దూరంగా పెట్టడమే. పోపుల డబ్బాలో కొద్దిపాటి చిల్లరకే ఆమె హక్కుదారు. దానివల్ల న్యూనతతో ఉండాలి. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాల సమయంలో భర్త/తండ్రి/కుమారుడి మాట చెల్లుబాటు కావడానికి కారణం వారు ‘ఆర్థిక వనరులు కలిగి ఉండటం’. ‘రూపాయి సంపాదన లేని దానివి నువు కూడా మాట్లాడేదానివేనా’ అని స్త్రీలను పరోక్షంగా అనడం. అదే ఆమెకు సంపాదన ఉంటే నా వల్ల కూడా కుటుంబం నడుస్తోంది కాబట్టి కుటుంబ సంక్షేమం కోసం నా పాయింట్ చెప్పాల్సిందే అని అనగలదు. కుటుంబపరంగా, సామాజికంగా తన జీవితం ఏ విధంగా గడవాలని స్త్రీ ఆశిస్తుందో ఆ నిర్ణయాన్ని వెల్లడించే శక్తి ఆర్థిక స్వావలంబన వల్ల కలుగుతుంది. ఆమెకు ఆర్థిక స్వాతంత్య్రం అవసరం. అందుకు చదువు ముఖ్య సాధనం. సాధికారత అంటే? స్త్రీలు సాధికారత పొందాలంటే వారి ఆకాంక్షలకు సమాజం ఆమోదం తెలపాల్సిందే. ఒక స్త్రీ అంట్రప్రెన్యూర్ కావాలనుకున్నా, పెద్ద పెద్ద సంస్థల్లో నాయకత్వ స్థానానికి ఎదగాలనుకున్నా, కాన్పు సమయంలో బ్రేక్ తీసుకుని నాలుగైదేళ్ల తర్వాత తిరిగి తన ఉద్యోగం చేయాలని అనుకున్నా, పెళ్లి తర్వాత పై చదువులకు వెళ్లాలనుకున్నా, గృహిణిగా ఉంటూ ఇంటిపట్టునే ఏదైనా పనిచేసి సంపాదించాలనుకున్నా వారికి అడ్డుగా నిలవకపోవడమే చేయవలసింది. ఒక అధ్యయనం ప్రకారం స్త్రీలు తమ సంపాదనలో 90 శాతం కుటుంబం కోసం ఖర్చు పెడతారు. పురుషులు నలభై–యాభై శాతం ఖర్చు పెడతారు. స్త్రీలు సాధికారత పొందడం అంటే తాము ఏం చేసినా పడి ఉంటుందనే భావన నుంచి పురుషులను బయట పడేయడం. ఎక్కువ తక్కువ లేని గౌరవ బంధాలను ప్రతిపాదించడం. ఆర్థిక అక్షరాస్యత స్త్రీలు సాధికారత, ఆర్థిక స్వావలంబన పొందాలంటే ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి. ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి స్త్రీలకు ఆర్థిక అక్షరాస్యతను కలిగించాలి. వ్యక్తిగత ఖర్చులు, కుటుంబ బడ్జెట్, పొదుపు, ఆదాయం తెచ్చే పెట్టుబడి... వీటి గురించి అవగాహన ఉండాలి. ‘మీ జీవితం మీ చేతుల్లో ఉండాలంటే’ మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలి... అందుకు ఏమి చేయాలో తెలుసుకోవాలి. సొంత ఆస్తి, స్వీయపేరు మీద పాలసీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, ఎమర్జన్సీ ఫండ్ కలిగి ఉండటం, డిజిటల్ పరిజ్ఞానం పొంది ఉండటం– అంటే ఆర్థిక లావాదేవీలు ఫోన్‌మీద, కంప్యూటర్ మీద చేయగలిగి వేగంగా పనులు నిర్వర్తించ గలగడం. కుటుంబ సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అనుకుంటే కుటుంబంలో కీలకమైన వాటాదారైన స్త్రీ ఎంత ఆర్థిక సమృద్ధితో ఉంటే దేశ సమృద్ధి అంతగా పెరుగుతుంది. ఉమెన్స్ డే సందేశం అదే. -
మీ ఫ్యామిలీ బడ్జెట్ వేశారా?
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి వచ్చేసరికి ప్రభుత్వాలు బడ్జెట్ పై కసరత్తు చేస్తుంటాయి. అది పెద్దస్థాయి కదా మనకెందుకులే అని వదిలేయద్దు. ఎందుకంటే, ఖర్చు ఎక్కడ పెట్టాలి..? ఎక్కడ తగ్గించుకోవాలి..? ఎంత మొత్తం పొదుపు చేయాలి..? వీటన్నింటికంటే ముందు ఆదాయం ఎంత? అన్న అంశాలపై అవగాహన ప్రతి కుటుంబానికీ కూడా ఉండాలి. అదే బడ్జెట్ ప్లానింగ్. మొన్న కేంద్ర బడ్జెట్ విడుదలైంది. ఇప్పుడు మన ఫ్యామిలీ బడ్జెట్ వంతు వచ్చింది. ఏమంటారు? నెలవారీ జీతాలతో లేదా స్వయం ఉపాధితో జీవనం సాగించే వారికి నెలవారీ బడ్జెట్ ప్లానింగ్ అత్యవసరం. మనకు వచ్చేదెంత? అందులో మనం దేనికి, ఎంత ఖర్చుపెట్టాలి..? ఎక్కడ ఆదా చేయాలి..? అన్న అంశాలపై అవగాహన ఉంటే ఇంటి నిర్వహణ సులువు అవుతుంది. బడ్జెట్ ప్లానింగ్ ఉంటే మీ నెలవారీ ఖర్చులను సులభంగా నిర్వహించుకోవచ్చు. అత్యవసర పరిస్థితి కోసం కొంత మొత్తం జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే కొంత మొత్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలుగా.. మీ చేతికి వస్తున్న సంపాదనలో 20 నుంచి 30 శాతం వరకూ పొదుపు చేయడం మంచిది. ఒకవేళ ఇంత మొత్తంలో చేయలేకపోయినా.. అవకాశం ఉన్న మేరకు పక్కన పెట్టాలని పెద్దల సలహా. కుటుంబ సభ్యుల ఆమోదం: ఫలానా దానికి ఇంత మొత్తం ఖర్చు పెట్టాలి అని మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఇంట్లోని ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. అలా ఉండాలంటే ముందుగా మీరు చేయాల్సింది... నెలవారీ బడ్జెట్ ప్లానింగ్ కోసం కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి వివరించాలి. రాబడి, ఖర్చుల విషయాలను అందరితో చర్చించాలి. అప్పుడు వారికి కూడా అవగాహన ఏర్పడి, ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వృథాను అరికట్టాలి మనం పొదుపు చేయాలి అంటే కుటుంబంలో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఏది అవసరం, ఏది అనవసరం అనే అవగాహన ఉండాలి. ముఖ్యంగా వృథా ఖర్చులను తగ్గించాలి. సరుకులు లేదా వస్తు సామగ్రిని ఎక్కువెక్కువ తెచ్చుకోవడం, ఇష్టం వచ్చినంత వండటం, పారెయ్యటం వల్ల ఎంతో డబ్బు వృథా అవుతుంది. అందువల్ల అట్లాంటి వృథాకు అడ్డుకట్ట వేయాలి. క్రెడిట్ కార్డుతో జాగ్రత్త.. క్రెడిట్ కార్డు ఉన్నది అత్యవసర సమయంలో ఉపయోగపడటానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. చేతిలో కార్డు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చుపెట్టకూడదు. మీ నెలవారీ రాబడిని అంచనా వేసుకొని అప్పుడు మాత్రమే కార్డును వినియోగించాలి. పొదుపు పథకాల్లో.. ఇలా ప్రతి నెలా బడ్జెట్ ప్లానింగ్ చేసుకొని ఆదా చేసిన సొమ్మును ఖతాలో అలా ఉంచకుండా.. మార్కెట్ రిస్క్ లేని పెట్టుబడి పథకాలు అంటే గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. పొదుపు ఎంత ఉండాలి? ఇది కాస్త క్లిష్టమైన ప్రశ్నే. పొదుపు చేయాలంటే ముందు మన ఆదాయాన్ని అంచనా వేసుకోవాలి. ఎందుకంటే, ఆదాయాన్ని బట్టి పొదుపు శాతం పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. అయితే, ఆదాయంతో సంబంధం లేకుండా, సాధారణ కుటుంబ ఖర్చులు మినహా మరే విధమైన అదనపు ఖర్చులూ లేకుండా ఉంటే పొదుపు ఎంత ఉండాలో చెప్పడానికి కొన్ని సూత్రాలు... ప్రతి మనిషి కనీసం ఆరునెలల జీతం లేదా ఆదాయాన్ని నగదు రూపంలో దాచుకోవాలి. ఒకవేళ ఒకేసారి అలా దాచుకోలేని వారు నెలనెలా కొంత పక్కనపెడుతూ ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ ఖర్చుకు సమానమైన ఆదాయం లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న దిగువ మధ్యతరగతి వారు తమ ఆదాయం లో ఐదు నుంచి పది శాతం పొదుపు చేయాలి. పొదుపు చేయడానికి మిగలక పోయినా ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారానో, ఖర్చును తగ్గించుకోవడం ద్వారానో కచ్చితంగా పొదుపు చేయాలి. నెలవారీ సగటు కుటుంబ ఖర్చు కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించేవాళ్లు నెలనెలా 25 శాతం పొదుపు చేయాలి. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తుంటే భర్త ఇంటి ఖర్చులు పెడతారు కాబట్టి భార్య 50 శాతం పొదుపుచేయాలి. అధికాదాయ వర్గాలు అయితే కుటుంబ ఆదాయంలో సగం పొదుపునకు మళ్లించాలి. భవిష్యత్తులో ఆదాయం పొరపాటున తలకిందులైతే ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఇలా చేసిన పొదుపు ఆదుకుంటుంది. పొదుపు మార్గాలు కొన్ని... ► అవసరం లేకుండా డిస్కౌంట్లలో వచ్చే వస్తువులు కొనద్దు. ► అవసరానికి ముందే ఏ వస్తువులనూ కొనుగోలు చేయకండి. ► నిర్దిష్ట తేదీల్లోపు బిల్లులు చెల్లించండి. దీని కోసం బిల్స్ పే క్యాలెండర్ తయారు చేసుకోవాలి. ► మీ బ్యాంకు ఖాతాలు ప్రతి నెల చివరన చూసుకోండి. వృథా ఖర్చులు తెలుస్తాయి. వృథా ఖర్చుల జాబితా రాయండి. ప్రతినెలా ఎంత వృథా పోతుందో తెలిస్తే ఆటోమేటిక్‌గా అప్రమత్తత పెరుగుతుంది. ► ఏ వస్తువు కొనాలన్నా ఇంటర్నెట్æద్వారా వివిధ మాల్స్/దుకాణాల్లో వాటి ధరల తేడాలు చూసి ఎక్కడ తక్కువో అక్కడ కొనండి. ఎందుకంటే ప్రతి డీలరు వేర్వేరు ధరలపై వస్తువులను అమ్ముతారు. చివరగా ఒక మాట... మీ బడ్జెట్ ఎంత పకడ్బందీగా ఉంటే భవిష్యత్తు అంత భద్రంగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా మీ పిల్లలకు కూడా ఇప్పటినుంచే పొదుపు చేయడాన్ని అలవాటు చేయండి. వారికి ఇచ్చే పాకెట్ మనీతో వారికి కావలసిన వాటిని ఎలా కొనుక్కోవాలో నేర్పించండి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ ఫైనాన్స్ మేనేజర్ లేదా నిపుణులైన హోమ్ మినిస్టర్ అవుతారు. ఇంతవరకు మీరు బడ్జెట్ వేసుకోకపోతే ఇప్పుడైనా వేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.. మీ బడ్జెట్‌ను నెలవారీ రివ్యూ చేసుకోవాలి. ఏమైనా మార్పులు అవసరం అయితే కచ్చితంగా ఆయా మార్పులు చేసుకోవాలి. ఇందుకోసం మీ కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. కచ్చితంగా పెట్టవలసిన ఖర్చును పక్కన పెట్టి.. ఇంకా ఏమైనా ఆదా చేసుకునే మార్గం ఉందేమో చూడాలి. -
ధనరేఖలు
రాజపూజ్యమింత, అవమానమింత అని పంచాంగం మాత్రమే చెప్పదు. మన ఇంటి బడ్జెట్ కూడా చెబుతుంది. మిగులుతున్నది ఎంతో చూసుకోకుండా ఖర్చు చేసుకుంటూ పోతే.. అవమానం! మిగుల్చుకున్నాకే ఖర్చులకు పోతే.. రాజపూజ్యం! రాబడి ఎంతని కాదు.. పోబడి ఎంతుందనే దాన్ని బట్టే మనం ధనవంతులం.. ఘనవంతులం. ఈ రోజు కేంద్రం బడ్జెట్ సమర్పిస్తోంది. ఆ బడ్జెట్ ఎలా ఉన్నా... మన లెక్కల్ని మనం తప్పకుండా ఉంటే.. ఇంట్లో అక్షయపాత్ర ఉన్నట్లే. చేతుల నిండా ధనరేఖలు ఉన్నట్లే. ఇంటి ఖర్చు తగ్గితే రూపాయి విలువ పెరుగుతుంది చేతిలో డబ్బు ఉంది కదా అని ఒక వస్తువును అవసరం లేకపోయినా కొంటే మన చేతిలో ఉన్న ‘రూపాయి’ విలువను పరిరక్షించడం మనకు చేతకాలేదని అర్థం. ‘‘ఒక కుటుంబం సంతోషంగా జీవనం సాగించాలంటే... ఖర్చులకు తగినంత రాబడి ఎంత ముఖ్యమో, రాబడిని బట్టి నెల వారీ బడ్జెట్ వేసుకోవడం కూడా అంతే ముఖ్యం’’ అంటారు అర్పిత. ‘‘గత ఏడాది మీ బడ్జెట్ ఎలా ఉంది, మీ బడ్జెట్ మీకు నేర్పిన పాఠాలేమిటి?’’ అని ‘సాక్షి’ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె తన అనుభవాలను పంచుకున్నారు. ‘‘రాబడి – ఖర్చు’ ల మధ్య సమన్వయం కోసం కొంత ఎక్సర్సైజ్ తప్పదు. ‘మనకు వచ్చే డబ్బు– మన అవసరాల జాబితా’ను సరిపోల్చుకోవాలి. నిత్యావసరాలు, పెద్దవాళ్ల ఆరోగ్యం కోసం రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు, మందుల కోసం కొంత కేటాయించాలి. పిల్లల చదువు, మిగిలిన అవసరాల కోసం కేటాయింపు తప్పని సరి. భవిష్యత్తు భద్రత కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసి తీరాలి. ఇక మిగిలిన డబ్బులో నుంచి సినిమాలు, వెకేషన్లు, ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్, వాహనాల వంటివి వచ్చి చేరుతుంటాయి. నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటినప్పుడు ఆ మేరకు ఖర్చు తగ్గించుకోవడానికి మధ్య తరగతి కుటుంబాల్లో సినిమానో, వెకేషన్నో మానుకోవాల్సి వస్తుంటుంది. ఆరోగ్య సమస్యల కారణంగా ఊహించని ఖర్చు వచ్చినప్పుడు కూడా కొన్ని సరదాలకు చెక్ పెట్టుకోవాల్సి రావచ్చు. ఏది అవసరం? అవసరాలను అదుపులో పెట్టలేం కానీ, సరదాలను అదుపులో పెట్టుకోవచ్చు. టీవీ ఉండాలనుకోవడం అత్యాశ కాదు. మరెవరింట్లోనో ఉన్నట్లు లక్షల విలువ చేసే టీవీ కొనాలనుకోవడమే పొరపాటు. రోజువారీ రాకపోకల కోసం వాహనం ఉండి తీరాల్సిందే, కానీ కొత్త మోడల్ వచ్చిన వెంటనే బైక్‌లు, కారులు మారుస్తూ పోతే.. ఇక ఆ దుబారాకు అంతూదరీ ఉండదు. ఇప్పుడు తరచు స్మార్ట్ ఫోన్లను మార్చడం ఫ్యాషనైంది. మా ఇంట్లో ఇంటికి అవసరమైన ఫర్నిచర్, గృహోపకరణాలన్నీ ఉన్నాయి. అయితే కొత్త మోడల్ కోసం ఉన్న వాటిని మార్చడం ఇంత వరకు జరగలేదు. ఇంటి ఇండెక్స్ మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయికీ ఒక విలువ ఉంటుంది. అది మార్కెట్ నిర్ణయించిన విలువ కాదు, మనం ఖర్చు పెట్టే తీరును బట్టి ఆ రూపాయి విలువ పెరుగుతుంది. ‘ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్’ అనేది ఎంత నిజమో, ఒక ఇంటిని చూస్తే ఆ ఇంటి వాళ్లు బడ్జెట్ విషయంలో తెలివిగా ఉన్నారా, డబ్బు దుబారా చేస్తున్నారా అనేది ఇట్టే తెలిసిపోతుంది’’ అన్నారు అర్పిత. – వాకా మంజులారెడ్డి ఆర్థిక నిపుణులు ఆడవాళ్లే నిజానికి ఇంటి బడ్జెట్ విషయంలో ఆడవాళ్లను మించిన ఆర్థిక నిపుణులు మరొకరు ఉండరు. వంద రూపాయలు చేతిలో పట్టుకుని వెళ్లి సంచి నిండా కూరగాయలు తీసుకురాగలిగిన నేర్పు మగవాళ్ల కంటే ఆడవాళ్లలోనే ఎక్కువ. ధరల పట్టిక చూసిన తర్వాత ఒక్క నిమిషంలో ‘ఏ కూరగాయలను మితంగా తీసుకోవాలి, ఏ కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి’ అనే నిర్ణయానికి వచ్చేస్తారు. – కె. అర్పిత, హైదరాబాద్ జాగ్రత్తగా ఉండడమే మా ప్లాన్ పేరెంట్స్ హెల్త్, వాళ్ల అవసరాలు, మా అబ్బాయి చదువు. ఇంటి ఖర్చులు అన్ని దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేసుకుంటాం. డబ్బు విలువ తెలిసివాళ్లెవరూ అనవసరమైన ఖర్చులు చెయ్యరు. జాగ్రత్తగా ఉండడమే మా ప్లాన్ అంటాడు వెంకటరమణ మోదుపల్లి. అనంతపురానికి చెందిన అతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. భార్య స్వాతి. ఎమ్‌టెక్ చేసింది కాని గృహిణిగానే ఉంటోంది. వాళ్లకు ఒక బాబు జయంత్. నర్సరీ చదువుతున్నాడు. వెంకటరమణ ఒక్కడే కొడుకు కావడం వల్ల తల్లిదండ్రులకూ అతనే ఆధారం. ‘అందుకే ఖర్చుల విషయంలో ఆచితూచే ఉంటాం. పేరెంట్స్ హెల్త్, వాళ్ల అవసరాలు, మా అబ్బాయి చదువు. ఇంటి ఖర్చులు అన్ని దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేసుకుంటాం నేను, మా వైఫ్. ఇంటి పనంతా తనే చూసుకుంటుంది. మాకు హెల్త్ కాన్షస్ కాస్త ఎక్కువే.\ కాబట్టి బయట లంచ్, డిన్నర్లకు వెళ్లడం తక్కువే. ఏదైనా ఇంట్లోనే. ఎలక్ట్రానిక్ గూడ్స్, గాడ్జెట్స్ మీద కూడా అంతగా ఖర్చు పెట్టం. స్మార్ట్ ఫోన్స్కూడా హై ఎండ్వి వాడం. షాపింగ్ వగైరా కూడా పండగలు, పుట్టినరోజులకే. ఇల్లు రెంట్, గ్రాసరీస్, పిల్లాడి స్కూల్ ఫీ, ఇతర ఖర్చులు పోను అమ్మానాన్న హెల్త్ కోసం కొంత, అనవసరమైన ఖర్చులు ఏమైనా వస్తే కొంత అని పక్కన పెట్టుకుంటాం. ఇది కాక ప్రతినెల పదివేలు సేవింగ్ చేస్తాం. డబ్బు విలువ తెలిసిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి.. అత్యంత అవసరమైతే తప్ప ఖర్చు చేయను’ అని తన ఫ్యామిలీ బడ్జెట్ గురించి చెప్పుకొచ్చాడు వెంకట రమణ. లోటుంటే తగ్గిస్తాం.. మిగులు అయితే ఖర్చు చేస్తాం.. ‘మా పెళ్లయి ఇంకా ఏడాది కాలేదు. కాబట్టి ఖర్చులు, సేవింగ్స్‌కు సంబంధించి మాకు సీరియస్ ప్లాన్స్ అంటూ ఏమీ లేవు.. ఈ వన్ ఇయర్.. ఫుల్ టూ ఫన్ అండ్ బిందాస్ అనే అనుకుంటున్నాం’ అంటారు బి. ప్రవీణ్ కుమార్, సౌమిత దంపతులు. వీళ్ల స్వస్థలం వైఎస్సార్ కడపజిల్లా, జమ్మలమడుగు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ప్రవీణ్ కుమార్ స్పైస్‌జెట్‌లో కెప్టెన్. గణిత శాస్త్రంలో మాస్టర్స్ చదివిన సౌమిత బిజినెస్ చేయాలనే ఆలోచనతో ఉంది. ప్రస్తుతమైతే గృహిణిగా ఇంటిని నిర్వహిస్తోంది. ‘ఇంటి ఖర్చులు తనే చూసుకుంటుంది. నా శాలరీ నుంచి నెలకు ఇంత అని సౌమితకు ఇచ్చేస్తాను. మిగతా అంతా నా దగ్గరే పెట్టుకుంటా. పర్సనల్ లోన్, కారు లోన్‌కు సంబంధించి రెండు ఈఎమ్ఐలు కడ్తాను. పెళ్లికి ముందు మా పేరెంట్స్‌కి డబ్బు పంపేవాడిని కాని ఇప్పుడు కుదరట్లేదు. నెలకు ఇరవై నుంచి ముప్పై శాతం సేవింగ్స్ ఉంటాయి. మిగతా అంతా ఖర్చులే. ఇన్సూరెన్స్ చేశాం ఇద్దరం విడివిడిగా’ అంటాడు ప్రణీత్ కుమార్. ఖర్చులు అంటే? ‘ఉండేది ఇద్దరమే అయినా త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాం. ఇన్లాస్, చుట్టాలు వస్తే ఇబ్బంది పడకుండా. ఇల్లు ఊడ్వడానికి, తుడవడానికి పనమ్మాయి. ఇంట్లో సరుకులు అంటే బియ్యం, కారప్పొడి, చింతపండు, పసుపు లాంటివన్నీ ఊరినుంచే వస్తాయి. కాబట్టి వెచ్చాలకు అంతగా ఖర్చు ఉండదు. వారానికి రెండుసార్లు రెస్టారెంట్స్‌కి వెళ్తాం. నెలకు ఒకటి రెండుస్లారు పార్టీలూ ఉంటాయి. ఒకసారి ఫ్రెండ్స్ ఇస్తే ఇంకోసారి మేమిస్తాం’ అని ప్రణీత్ భార్య సౌమిత చెప్తూంటే మధ్యలో ప్రణీత్ అందుకొని ‘వారానికి రెండు మూడు సినిమాలూ ఉంటాయి కచ్చితంగా. రిలీజ్ అయిన సినిమా చూడాలి కదా’ అన్నాడు. ‘ఇవికాక షాపింగ్ ఖర్చులు అదనం’ కంటిన్యూ చేశాడు. ‘షాపింగ్ తను ఖర్చు చేసేదే ఎక్కువ బ్రాండెడ్ బట్టల మీద. నెలకు ఒక్కసారైనా బట్టలు కొంటారు. నాది బట్టల ఖర్చు తక్కువనే చెప్పొచ్చు. ఎప్పుడైనా ఆన్లైన్లో కాస్మెటిక్స్, ఆర్ట్ఫిషియల్ జ్యుయెలరీ కొంటా అంతే’ చెప్పింది సౌమిత. గాడ్జెట్స్ వగైరా... ‘లేదు. ఒక్కసారి కొంటే అంతే. వాటి అంత మోజు లేదు. కాని టూర్స్ మీద ఖర్చు చేస్తాం. నిజానికి పెళ్లయ్యాక ఒక వన్ ఇయర్ వరకు సేవింగ్స్ జోలికి వెళ్లకుండా లైఫ్ ఎంజాయ్ చేద్దామనుకున్నాం. అలాగే చేస్తున్నాం కూడా. అందుకే మూడు నెలలకు ఒకసారి దేశంలో నచ్చిన ప్లేసెస్‌కి వెళ్లాలని.. ఆర్నెల్లకు ఒకసారి ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలని అనుకున్నాం. అలాగే వెళ్తున్నాం. మొన్ననే మాల్దీవులకు వెళ్లొచ్చాం. నెక్ట్స్ ఇయర్ ప్రమోషన్ ఉంది. అప్పుడు ఇల్లు, పిల్లలు ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం’ అంటూ తన ప్రెజెంట్ బడ్జెట్, ఫ్యూచర్ ప్లాన్ చెప్పాడు ప్రణీత్. నెలాఖరుకి లోటు తేలుతుందా.. మిగులు కనపడుతుందా? ‘ఒక్కో నెల ఒక్కో రకంగా ఉంటుంది. లోటు తేలగానే వచ్చే నెల ఖర్చులను కొంచెం తగ్గిస్తాం. మిగులు కనపడితే.. కొత్త ఖర్చుని ప్లాన్ చేసుకుంటాం’ అంటారు నవ్వుతూ ప్రణీత్ అండ్ సౌమిత. సినిమాలూ తగ్గించాం ‘‘బయటి నుంచి తెప్పించుకునే ఆహారపదార్థాలు, సినిమాలకు కూడా కొంత పరిమితి పెట్టుకున్నాం. అందువల్లే పెరిగిన ఖర్చులను తట్టుకోగలుగుతున్నాం. పిల్లల చదువుకోసం వికారాబాద్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీనివాస్‌రెడ్డి, సుమతి దంపతులను తమ బడ్జెట్ ప్లానింగ్ గురించి అడిగితే ‘‘ఖర్చులు తగ్గించుకోవడమే ప్రధానంగా పెట్టుకున్నాం. పొదుపు విషయంలో కచ్చితంగా ఉన్నాం’’ అని చెప్పారు. ‘‘మా అమ్మాయి ఇంంజనీరింగ్ ఫస్టియర్, అబ్బాయి ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతున్నారు. మూణ్ణెల్ల క్రితం వరకు పిల్లలను హాస్టల్లో పెట్టి చదివించేవాళ్లం. తర్వాత హైదరాబాద్ వచ్చి ఇల్లు అద్దెకు తీసుకున్నాం. మాది వ్యవసాయ కుటుంబం. వరి, పత్తి, మొక్కజొన్న పండిస్తాం. ఊళ్లో ఉన్నప్పుడు నెలసరి ఇంటి ఖర్చు ఐదారువేలతో సరిపోయేది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఇరవై వేలకు పైనే అవుతోంది. పంట వల్ల వచ్చే ఆదాయం సరిపోదని బోర్వెల్ వ్యాపారం చేస్తున్నాను. అంటే, ఖర్చు పెరుగుతోందని అర్ధమయ్యాక ఇతరత్రా రాబడి మార్గాలు చూసుకోవాల్సిన ఆవశ్యకతపైనా దృష్టిపెట్టాలి’’ అన్నారు శ్రీనివాసరెడ్డి. ఇన్సూరెన్స్ తప్పనిసరి ‘‘పిల్లల చదువులు, ఇతర ఖర్చులు ఉన్నప్పటికీ సంవత్సరానికి ఇంత అని కొంత మొత్తాన్ని పొదుపు చేస్తాను. ఏ కారణంగానైనా పిల్లల చదువులు మధ్యలో ఆగిపోతే వాళ్ల భవిష్యత్తు దెబ్బతింటుంది. అందుకని ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాను. వాటిల్లో మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. పోస్టల్ శాఖలోనూ చిన్నమొత్తమైనా నెలకు కొంత అని రికరింగ్ డిపాజిట్ చేస్తుంటాను’’ అన్నారు ఆయన. ‘‘పిల్లలు స్థిరపడేంతవరకు లగ్జరీ వస్తువులేవీ కొనడానికి వీల్లేదని ముందే నియమం పెట్టుకున్నాం..’’ అంటూ గృహిణిగా తన బాధ్యతను వివరించింది సుమతి. ‘‘బయటి నుంచి తెప్పించుకునే ఆహారపదార్థాలు, సినిమాలకు కూడా కొంత పరిమితి పెట్టుకున్నాం. అందువల్లే పెరిగిన ఖర్చులను తట్టుకోగలుగుతున్నాం. కుటుంబం ఒడిదొడుకులకు లోనుకాకుండా ఉండాలంటే ఇంటి యజమానే కాదు ఆ ఇంట్లో అందరి సహకారం అవసరం. అందరూ ఒక్కమాట మీద ఉంటే మన రాబడి ఎంత, ఖర్చు ఎంత, మిగులు ఎంత అనే విషయాల్లోనూ ఒక అవగాహన వస్తుంది. అది ఈ రోజుల్లో చాలా అవసరం కూడా. పెరుగుతున్న పిల్లలకు ఈ విషయాలు తెలియజేస్తే భవిష్యత్తు పట్ల వారికీ ఒక అవగాహన ఉంటుంది. బాధ్యతగా నడుచుకుంటారు’ అని వివరించారు శ్రీనివాస్‌రెడ్డి, సుమతి దంపతులు. – నిర్మలారెడ్డి ఆర్భాటాలకు పోము పులిని చూసి నక్క వాత పెట్టుకుందేమో కాని, మేం ఆ పని చేయట్లేదు. అసలు ఇరుగుపొరుగులను పట్టించుకునే తీరికే ఉండదు. ఉరుకుల పరుగుల జీవితం. ‘‘ఇంటి అద్దె కోసం ఏడు వేలు, ఇద్దరి దారి ఖర్చుల కోసం మూడు వేలు, సరుకుల కోసం నాలుగు వేలు, పిల్లల జీతాల కోసం మూడు వేలు తప్పనిసరిగా పక్కన ఉంచాల్సిందే. ఉల్లిపాయల రేటు పెరిగినప్పుడు, వాటిని మాడటం మానేశాం. నిత్యావసర సరుకులు పెరగటంతో ఒక రకమే వండుకోవటం ద్వారా ఎకౌంట్ బ్యాలెన్స్ చేసుకున్నాం’’.– శివాజి, ఆడిటర్, శ్రీహర్ష, స్టాఫ్ నర్స్ విజయవాడ -
యంత్రాల్లేవు... ఇంటర్నెట్టూ లేదు..!
దేశంలో పెద్ద నగరాల్లో కూడా ఇప్పుడిప్పుడే డిజిటల్ లావాదేవీలు, మొబైల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు ప్రాచుర్యంలోకి వస్తున్నారుు. ఇక చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి లావాదేవీలను ఆచరణలోకి తేవడం అంత తేలికేమీ కాదు. ఎర్నస్ట్ అండ్ యంగ్ కన్సల్టెన్సీ సంస్థ అధ్యయనం ప్రకారం కార్డ్‌లను స్వైప్ చేసే మెషిన్లు.. (పారుుంట్ ఆఫ్ సేల్) టెర్మినల్స్ సంఖ్య చాలా తక్కువున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 70% పీవోఎస్ టెర్మినల్స్ దేశంలోని టాప్-15 నగరాల్లోనే ఉన్నారుు. మొత్తం లావాదేవీల పరిమాణంలో వీటి వాటా 75%కి పైగా ఉంటోంది. పెపైచ్చు మన దగ్గర బ్యాంకింగ్ సదుపాయాలు సైతం భారీ స్థారుులో కార్డు లావాదేవీలను తట్టుకునేలా లేవు. చాలా సందర్భాల్లో పీవోఎస్ టెర్మినల్స్ సరిగ్గా పనిచేయక మళ్లీ డబ్బుతోనే చెల్లించాల్సిన పరిస్థితి ఉంటోంది. ఇక ఇంటర్నెట్ కనెక్టివిటీ మరో సమస్య. ఇప్పటికీ చాలా చోట్ల ఇంటర్నెట్ సరిగ్గా లేదు. దీంతో మొబైల్ వాలెట్ లాంటి వాటిలో డబ్బులున్నా లావాదేవీలు చేసేందుకు ఆస్కారం ఉండని పరిస్థితి. డిజిటల్ పెరుగుతున్నప్పటికీ... దేశీయంగా డిజిటల్ చెల్లింపుల పరిమాణం పెరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. గణాంకాల ప్రకారం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్సఫర్ (నెఫ్ట్) రూపంలో ఆన్లైన్ లావాదేవీలు 2009-10లో సుమారు రూ.4 లక్షల కోట్లుండగా.. 2015-16లో రూ.83 లక్షల కోట్లకు చేరారుు. ఇప్పుడు కొత్తగా వాలెట్లు కూడా అందుబాటులోకి వస్తున్నారుు. అరుునప్పటికీ.. చిన్నా, చితక పనులకు అవసరమయ్యే ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు మొదలైన వారికి చెల్లించే చిన్న మొత్తాలకు నగదు కాకుండా చెక్కులు, నెఫ్ట్ లు వాడితే లావాదేవీ భారం మరింత పెరుగుతుందనేది నిపుణుల మాట. కాబట్టి, డిజిటల్ మాధ్యమంలో అదనపు ఖర్చుల భారాన్ని దృషి ్టలో ఉంచుకుని లావాదేవీలు నిర్వహించడం శ్రేయస్కరమనేది వారి సూచన. -
ఆన్లైన్లో...చిలక్కొట్టుడు!
సినిమా టికెట్ల నుంచి పెట్రోలు దాకా మోతే... • ఫ్యామిలీ బడ్జెట్ తలకిందులు • సూపర్ మార్కెట్, హోటల్లోనూ బాదుడే • క్రెడిట్ కార్డుకే కాదు.. డెబిట్ కార్డులకూ తప్పని భారం • డిజిటల్ లావాదేవీలపై సర్వీస్ ట్యాక్సులు, సర్‌చార్జీలు • మరింత భారం కానున్న కుటుంబ బడ్జెట్ చేతిలో డబ్బుల్లేవు. ఉన్న డబ్బులన్నీ బ్యాంకులోనే ఉన్నారుు. ఏటీఎంల నుంచి గానీ... బ్యాంకుల నుంచి గానీ విత్‌డ్రా చేసే పరిస్థితి లేదు. ఫలితం... తప్పనిసరై, నిర్బంధంగా అంతా ఆన్‌లైన్‌కు మళ్లాల్సి వస్తోంది. కాకపోతే ఇంటర్నెట్ సౌకర్యం లేనివారు, అసలు నెట్ అంటే తెలియని వారు, మొబైల్లో నెట్ లేనివారు... ఉన్నా ఎలా వాడాలో తెలియనివారు మన దేశంలో కోకొల్లలు. వారంతా గతిలేక ఏటీఎంల ముందు పడిగాపులు కాస్తుంటే... తెలిసినవారంతా విధిలేక ఇంటర్నెట్ ఆర్థిక లావాదేవీలవైపు మళ్లుతున్నారు. ఇదీ... వాస్తవ చిత్రం. ఇక ప్రభుత్వమేమో ఆన్‌లైన్‌వైపు మళ్లండంటూ విపరీతంగా ఊదరగొడుతోంది. వాలెట్లు, ఆన్లైన్ బ్యాకింగ్ వ్యవస్థలు తమ ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఒక్కసారిగా 300%.. 500% పెరిగాయంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారుు. చేతిలో డబ్బుల్లేక అంతా నిర్బంధంగా నెట్ వైపు నడుస్తుంటే మరి లావాదేవీలు పెరక్క ఏం చేస్తాయనే సం దేహం ఎవరికై నా రావచ్చు. అది నిజమే కూడా!! సరే! ఇదంతా పక్కనబెడితే అసలు ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో చార్జీలెంత ఉంటారుు? ఇవేమన్నా నగదు మాదిరి ఇతరత్రా చార్జీల్లేకుండా ఉంటాయా? ప్రస్తుతానికై తే ప్రభుత్వం డిసెంబర్ 31 వరకూ అన్ని లావాదేవీలపైనా చార్జీల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కానీ సినిమా టికెట్ల నుంచి అంతా ఈ చార్జీల్ని వసూలు చేస్తూనే ఉన్నారు. అసలు కార్డు, ఆన్లైన్ లావాదేవీల్లో చార్జీలెలా ఉంటారుు? ఎవరెంత వసూలు చేస్తున్నారు? ఇంటి బడ్జెట్ ఎంత పెరుగుతుంది? ఇవే ఈ వారం ప్రాఫిట్ కథనాలు.. సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం మీరు సినిమాకు వెళ్దామనుకున్నారు. అక్కడికి వెళ్లి లైన్లో నిల్చుని టికెట్లు తీసుకునే ఓపిక లేదు. పెపైచ్చు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇప్పుడు మీ దగ్గర డబ్బులు కూడా లేవు. సరే! ఆన్లైన్లో చూసుకుని ఏ ‘బుక్‌మై షో’ సైట్ ద్వారానో, లేక పేటీఎం ద్వారానో టికెట్లు బుక్ చేద్దామనుకున్నారనుకోండి. బుక్ మై షో చార్జీలు, సర్వీస్ చార్జీలు, ఇతరత్రా పన్నుల పేరిట ఒకో టికెట్‌పై రూ.20 నుంచి 40 వరకూ చెల్లించకతప్పదు. పోనీ పెట్రోల్ పోరుుంచుకున్నారనుకోండి. రూ.150 పెట్రోల్ పోరుుంచుకుంటే నగదు రూపంలో రూ. 150 మాత్రమే కడతారు. కొన్ని కార్డులైతే బిల్లు మొత్తంలో 2.5 శాతాన్ని వసూలు చేస్తున్నారుు. చిత్రమేంటంటే డెబిట్ కార్డుతో చెల్లించినప్పుడు కూడా సర్‌చార్జీలు, సర్వీస్ చార్జీల పేరిట రూ.11.50 దాకా వదులుకోవాల్సి వస్తోంది. ఈ తరహా మోత డెబిట్ కార్డులపై 0.75-1 శాతం, క్రెడిట్ కార్డులపై 2.5 శాతం దాకా ఉంటోంది. ఇలా డెబిట్, క్రెడిట్ కార్డులతో జరిపే లావాదేవీలపై ఉండే అదనపు వ్యయాల్ని ప్రస్తుతం వ్యాపారులు భరించాల్సి వస్తోంది. వారేమో వీటిని చాలా సందర్భాల్లో కస్టమర్లపైనే వేస్తున్నారు. ఈ అదనపు చార్జీల్ని ఎత్తివేయాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. ఇప్పటిదాకా అతీగతీ లేదు. నగదు రహిత లావాదేవీలంటూ అంతా ఆన్లైన్లో చేస్తూ పోతే ఇప్పుడున్న ఛార్జీల ప్రకారం సామాన్యుడి బడ్జెట్ కుదేలవక తప్పదు. నిత్యావసరాలపైనా మోతే!! పీవోఎస్ మెషీన్లు, ఆన్లైన్ చెల్లింపుల వెసులుబాటు ఉండే చిన్న వ్యాపారస్తుల సంఖ్య చాలా తక్కువ. కాబట్టి కొన్ని నగరాల్లో పండ్లు, కూరగాయలకు కూడా డిజిటల్ చెల్లింపులు చేయాలంటే సూపర్‌మార్కెట్‌కు వెళ్లాలి. అక్కడ వివిధ చార్జీల రూపంలో 5-30 శాతం అధికంగా కట్టడానికి సిద్ధపడాలి. దీనికి తోడు మాల్ లేదా సూపర్ మార్కెట్ దాకా వెళ్లేందుకు, అక్కడ పార్కింగ్ చేసేందుకు ఇంకాస్త ఖర్చవుతుంది. ఒకవేళ సదరు సూపర్మార్కెటు మీకు కావాల్సిన సాధారణ పాల ప్యాకెట్లను అమ్మకుండా టెట్రా ప్యాక్‌లు మాత్రమే అమ్ముతోందనుకోండి. అప్పుడు మీరు మరో 50 శాతం ఎక్కువ పెట్టే వాటిని కొనుక్కోవాలి. దీంతో రోజుకో లీటరు చొప్పున నెలకు సుమారు రూ.1,200 పైచిలుకు అయ్యే పాల బిల్లు ఏకంగా రూ.1,800కు పెరుగుతుంది. కార్డులతో చెల్లింపులు జరిపే వారికి డిస్కౌంట్లనో, పంచదార వంటి ఉత్పత్తులు ఉచితమనో ఆయా సూపర్ మార్కెట్లు ఊరించినా... తత్సంబంధిత ఖర్చులన్నింటితో పోలిస్తే చాలా సందర్భాల్లో ఇంటికి దగ్గర్లోని కిరాణ దుకాణాదారు కన్నా ఎక్కువే అవుతుంది. ఇలా సూపర్మార్కెట్లు కాకుండా ఆన్లైన్లో కూడా నిత్యావసరాలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంది. దీనివల్ల రవాణా ఖర్చులు, సమయం ఆదా అరుునప్పటికీ.. కనీస ఆర్డరు ఇంత ఉంటే గానీ (ఉదాహరణకు రూ. 500, రూ. 1,000) ఉచిత డెలివరీ లభించడం లేదు. ఒకవేళ అంతకన్నా తక్కువ మొత్తానికి కొనుగోళ్లు చేస్తే అదనంగా రూ.25-50 డెలివరీ చార్జీల కింద చెల్లించాల్సి ఉంటోంది. ఏ రారుుతో కొట్టుకున్నా ఒకటే కదా!! ప్రయాణమంటే అంతే!! మీరోసారి గమనించి చూడండి! లైన్లో నిల్చుని తీసుకున్న రైలు టికెట్ కన్నా... ఆన్లైన్లో తీసుకునే టికెట్ ఖరీదు కాస్త ఎక్కువ. ఎందుకంటే సర్వీసు ఛార్జీలు, బ్యాంకు ఛార్జీలు అన్నీ జతరుుపోతారుు. ప్రస్తుతం డిసెంబరు 31వరకూ వీటిని తొలగించినా... ఆ తరవాత మళ్లీ ఠంచనుగా ప్రత్యక్షమరుుపోతారుు. విమానం టికెట్లదీ అదే పరిస్థితి. క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే టికెట్‌కు రూ.150 చొప్పున అదనంగా చెల్లించాలి. డెబిట్ కార్డరుుతే ఇది సగానికి తగ్గుతుంది. ఈ లెక్కన చూస్తే బస్సులే కాస్త నయం. అక్కడ అదనపు బాదుడుండదు. ఇక చాలా మంది లోకల్ బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తున్నప్పటికీ... ఆయా స్టేషన్లు, బస్ స్టాప్‌లు చేరుకోవడానికి మళ్లీ ఆటోలు, ట్యాక్సీల్లాంటి వాటిని ఆశ్రరుుంచాల్సి వస్తోంది. ముంబై వంటి నగరాల్లో ఒక నాలుగు కిలోమీటర్ల దూరానికి ఆటో, ట్యాక్సీ చార్జీలు రూ.49-59 గా ఉంటున్నారుు. అదే యాప్ ఆధారిత ట్యాక్సీని గానీ తీసుకుంటే ఈ చార్జీలు రెట్టింపై రూ.100 దాకా ఉంటున్నారుు. అరుుతే, తక్కువ దూరాల కన్నా ఎక్కువ దూరాాల ప్రయాణాలకు ఇలాంటి యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలు కాస్త చౌకగానే ఉంటున్నారుు. కాకా హోటల్లో కార్డు కష్టం! చిన్నపాటి హోటళ్లు, మెస్‌లలో భోజనం చేస్తే రూ.70-80 సరిపోతోంది. కానీ అదే కార్డులపై చెల్లింపులు జరిపే వీలున్న ఒక మోస్తరు రెస్టారెంట్లకు వెడితే ఈ ఖర్చు రూ.200కు తగ్గదు. కనీస బిల్లు మొత్తం రూ.100 కన్నా తక్కువగా ఉంటే ఈ హోటళ్లు కార్డులను యాక్సెప్ట్ చేయవు. దీంతో చిన్నపాటి హోటల్లో టీ లేదా కాఫీ, స్నాక్స్ తీసుకుంటే రూ.30-40 అయ్యే ఖర్చు కాస్తా... డిజిటల్ పేమెంట్స్‌కు వీలున్న రెస్టారెంట్లో కచ్చితంగా రూ.100 వరకూ అవుతుంది. ఫుడ్ ఆర్డరింగ్ యాప్స్ కూడా ఇపుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నారుు. కానీ ఇవి కూడా ఉచిత డెలివరీ చేయాలంటే కనీసం రూ.150-200 మేర బిల్లింగ్ ఉండాలంటున్నారుు. లేదంటే డెలివరీ చార్జీలుగా రూ.20- 40 వడ్డిస్తున్నారుు. కార్డే కదా అని గీకితే... పెద్ద నోట్లను రద్దు చేయటంతో... క్రెడిట్ కార్డును పర్సులో ఉంచుకుని కూడా నగదు వాడటానికే ఇష్టపడ్డవారు ఇప్పుడిక తప్పనిసరిగా ఆ కార్డులు బయటకు తీయాల్సి వస్తోంది. వీరిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా... డిసెంబర్ 31 వరకూ ఎలక్ట్రానిక్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలూ ఉండవని ప్రకటించింది. మరి ఆ తరవాత కూడా క్రెడిట్ కార్డు వాడితే ఏమవుతుంది? ఇటీవల బ్యాంకింగ్ కోడ్స అండ్ స్టాండర్డ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (బీసీఎస్‌బీఐ) ఒక నివేదికలో చెప్పిన మాటేంటంటే... ఉచిత క్రెడిట్ కార్డు అనేది మిథ్య అని. అందుకే కార్డు తీసుకునే ముందుగానీ, తీసుకుని ఉంటే ఇప్పుడుగానీ... బ్యాంకు చెప్పిన నియమ నిబంధనల్ని జాగ్రత్తగా చదవాలి. అందులోనే ఉంటుంది... ఆ బ్యాంకు ఏఏ లావాదేవీలపై ఎంతెంత చార్జీలు విధిస్తుందో. నిజం చెప్పాలంటే క్రెడిట్ కార్డుకు సంబంధించి ఈ నియమ నిబంధనల పత్రమే అత్యంత కీలకమైన డాక్యుమెంటు. దీని ఆధారంగా అసలు ఏఏ చార్జీలు ఎంతెంత ఉంటాయో తెలియజెప్పే ప్రయత్నమే ఇది... క్రెడిట్ కార్డు చార్జీలు... • ఇక్కడ గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నారుు. సాధారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డులకు పైన పేర్కొన్న ఛార్జీలన్నీ వర్తిస్తున్నారుు. • కొన్ని బ్యాంకులు మాత్రం వార్షిక ఫీజును పూర్తిగా మినహారుుస్తున్నారుు. కొన్నరుుతే కస్టమరుకార్డుపై ఖర్చు చేసిన మొత్తాన్ని బట్టి ఈ ఫీజును తొలగిస్తున్నారుు. • చాలా కార్డులు ప్రతి నెలా నిర్దేశిత మొత్తం వరకూ పెట్రోలు, డీజిల్ కొనుగోళ్లపై సర్ఛార్జిని తొలగిస్తున్నారుు. కనీస లావాదేవీ అంటే ఎలా? చేతిలో డబ్బుల్లేవు కదా అని కార్డు పట్టుకుని బయల్దేరాడు అశోక్. దగ్గర్లోని పతంజలి స్టోర్‌కు వెళ్లి తేనె, రెండు సబ్బులు తీసుకుందామనుకున్నాడు. మొత్తం బిల్లు రూ.230 అరుుంది. బిల్లు చెల్లించడానికి కార్డు అందజేశాడు. కానీ... దాన్ని ఆ దుకాణ యజమాని తిరస్కరించాడు. ‘సార్! కనీసం రూ.300 బిల్లు చేస్తేనే కార్డుపై తీసుకుంటాం. లేకుంటే క్యాష్ ఇవ్వాల్సిందే’ అని చెప్పాడు. అశోక్‌కు చిరాకొచ్చింది. నీ బిల్లు కోసం నాకు అక్కర్లేని వస్తువులు కొనలేను కదా!! అంటూ బయటికొచ్చేశాడు. వచ్చి... ట్వీటర్లో అదే విషయాన్ని ట్వీట్ చేశాడు. నిజమే!! ఒక్క అశోక్ విషయంలోనే కాదు. చాలామంది విషయంలో ఇపుడు ఇదే జరుగుతోంది. ఈ-కామర్స్‌లో అరుుతే ఉచిత డెలివరీ కావాలంటే కనీస షాపింగ్ మొత్తం ఉంటుంది. ఇక సూపర్ మార్కెట్లు, దుకాణాలు, చిన్న చిన్న హోటళ్లలో అరుుతే కనీస మొత్తానికి బిల్లింగ్ చేస్తేనే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు తీసుకుంటారు. దానికోసం అవసరం లేనివి కూడా కొనాలా? అనేదే వినియోగదారు ప్రశ్న. ఈ అంశాలు గమనించండి..! ఫ్రీ కార్డ్ అంటున్నారా? ఏదైనా బ్యాంకు మీకు ఉచితంగా క్రెడిట్ కార్డు ఇస్తున్నామని చెబితే దానర్థం జారుునింగ్ ఛార్జీలను, తొలి ఏడాది వార్షిక ఛార్జీలను తొలగిస్తున్నట్లు లెక్క. పక్కాగా జీవిత కాల వార్షిక రుసుము తొలగిస్తున్నట్లు చెబితే తప్ప... అది ఫ్రీకార్డ్ కానే కాదు. సిటీ బ్యాంక్ వంటివి కొన్ని నిబంధనలకు లోబడి లైఫ్‌టైమ్ ఫ్రీ కార్డులు అందిస్తున్నారుు. కనీస మొత్తం చెల్లిస్తే అంతే! మీరు గనక మీకు వచ్చిన బిల్లులో కనీసం ఎంత చెల్లించాలో అంతే చెల్లించి ఊరుకున్నారనుకోండి. మీ అప్పు ఎప్పటికీ తీరదు. ఎందుకంటే మిగిలిన మొత్తంపై విధించే వడ్డీలు దారుణంగా ఉంటారుు. అందుకే వాడిన మొత్తం బిల్లును ఆ నెలలోనే చెల్లించేసి... మళ్లీ కొత్తగా మరుసటి నెల వాడుకుంటే మంచిది. పరిమితి దాటారో..! ప్రతి కార్డుకూ ఒక పరిమితి అంటూ ఉంటుంది. మీరు గనక ఎప్పుడైనా ఆ పరిమితిని దాటి వాడేశారంటే... ఓవర్ డ్రాఫ్ట్ ఛార్జీలు, జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. బిల్లు చెల్లించకపోతే... నెలనెలా మీకు బిల్లు వచ్చినపుడు దాన్లో చెల్లించాల్సిన గడువు తేదీ ఉంటుంది. ఆ తేదీని జాగ్రత్తగా గుర్తుంచుకుని అప్పటిలోగానే బిల్లు చెల్లించేయాలి. అలా చేయకపోతే పెనాల్టీ, వడ్డీ కలిసి తడిసి మోపెడవుతుంది. బయటి ప్రాంతాల చెక్కులిస్తే.. మీకు ఎస్బీఐ కార్డుంది. బిల్లు చెల్లించే సమయానికి మీరు ఏ ముంబాయో వెళ్లి... అక్కడ గనక చెక్కుపై చెల్లించారనుకోండి. మీ చెక్కు హైదరాబాద్‌ది కనక అదనపు ఛార్జీలవుతారుు. అలాకాక హైదరాబాద్‌లో ఉండి మీరు వేరే ప్రాంతపు చెక్కు ఇచ్చినా ఈ ఛార్జీలుంటారుు. ఇక ఈ చెక్ బౌన్సరుుతే జరిమానాలు, పెనాల్టీలు, ఆలస్య రుసుములు అన్నీ కలిసి భరించలేని స్థితికి తీసుకెళతారుు. నగదు తీయకుంటేనే మంచిది... ప్రతి క్రెడిట్ కార్డుపైనా పరిమితి ఉన్నట్టే దాన్లో నగదు విత్‌డ్రా చేసుకోవటానికి కూడా కొంత పరిమితి ఉంటుంది. ఉదాహరణకు రూ.2 లక్షలు గనక కార్డు పరిమితి అరుుతే అందులో 30 శాతం... అంటే రూ.30వేల వరకూ నగదును ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే లావాదేవీల చార్జీలతో పాటు నగదుపై వడ్డీ కూడా భారీగానే ఉంటుంది. అందుకని నగదు తీయకుంటేనే బెటర్. దేశీయంగా వినియోగదారులు జరిపే లావాదేవీల్లో పరిమాణంపరంగా 95 శాతం, విలువపరంగా 65 శాతం నగదు రూపంలోనే ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నారుు. ఇప్పటికీ భారత్ ప్రధానంగా నగదు లావాదేవీలపైనే ఎక్కువగా ఆధారపడిన దేశంగా పేర్కొంటున్నారుు. ఇలాంటి పరిస్థితుల్లో చెలామణీలోని నగదులో 86 శాతం పైగా వాటా ఉన్న పెద్ద నోట్లను ఎకాయెకిన రద్దు చేసి పారేయడంతో సామాన్యుల పరిస్థితి గందరగోళంగా మారిం ది. చేతిలో నోటు లేక, బ్యాంకుల్లో ఉన్నవి అందక తప్పనిసరై నిర్బంధంగా డిజిటల్ లావాదేవీలవైపు మళ్లక తప్పడం లేదు. ఆన్లైన్ లావాదేవీలు అత్యంత సులభతరమైనవంటూ ఊదరగొడుతున్నవారు.. నగదు లావాదేవీలతో పోలిస్తే ఇవి మరింత ఖరీదైనవన్న సంగతి మాత్రం చెప్పడం లేదు. ప్రస్తుతానికి కొద్ది రోజుల పాటు ఏటీఎం లావాదేవీల చార్జీలను రద్దు చేసినప్పటికీ .. పెట్రోల్ బంకులు మొదలుకుని సినిమా టికెట్ల దాకా డిజిటల్ మాధ్యమంలో చేసే వివిధ లావాదేవీలకు చార్జీలు కొనసాగుతూనే ఉన్నారుు. -
సంతోషం అనే వడ్డీ మిగలాలి
రూపాయి వ చ్చినా, పోయినా... ఉమన్ ఫైనాన్స్ మన దేశానికి ఆర్థిక మంత్రి ఎలాగైతే ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను రూపొందించి, ఒక ప్రణాళిక ప్రకారం ఆదాయ వనరులను వినియోగించి దేశ పురోగతికి తోడ్పడతారో... అదే విధంగా ప్రతి గృహిణీ, ఉద్యోగినీ తన వంతు బాధ్యతగా తమ కుటుంబ బడ్జెట్‌ను రూపొందించుకొని దాని ప్రకారం నడుచుకుంటే సంసారం అనే బండి ఏ ఒడిదుడుకులూ లేకుండా గమ్యాన్ని చేరుతుంది. గమ్యం తెలియకుండా ప్రయాణాన్ని ఎవరూ మొదలు పెట్టరు. ఇదే సూత్రం కుటుంబ ఆర్థిక ప్రణాళిక అమలులోనూ కనిపిస్తుంది. ఆర్థికంగా మీరు ఎక్కడ ఉన్నారు? ఎక్కడికి చేరుకోవాలని అనుకుంటున్నారు? అనే స్పష్టతను కలిగి ఉండాలి. ఈ స్పష్టతను బడ్జెట్ అందిస్తుంది. బడ్జెట్ అంటే... మీకు ఏయే రూపాలలో ఆదాయం సమకూరుతుంది? మీకు ఉన్నటువంటి ఖర్చులు ఏంటి? అవి పోగా మిగులు / తగులు ఎంత? మిగులును ఏ విధంగా పెట్టుబడి పెట్టి మీ భవిష్యత్తు అవసరాలకు నిధులు సమకూర్చుకోవాలి? తగులును ఏ విధంగా అధిగమించాలి? ఇలాంటివన్నిటినీ నమోదు చేసి మీ కుటుంబానికి ఒక ప్రణాళిక ఏర్పరచుకోవడమే. ముందుగా మీరు మీకు ఉన్నటువంటి ఆదాయ మార్గాలనన్నింటినీ (జీతం, అద్దె, వడ్డీ, వ్యాపారం, వ్యవసాయం మొదలైన వాటి నుంచి వచ్చే ఆదాయం) నమోదు చేయండి. ఈ ఆదాయం ఏయే నిర్ణీత సమయాలలో.. నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి.. వస్తుందో రాయండి. ఏయే ఖర్చులు ఏయే నిర్ణీత సమయాలలో ఉంటాయో పొందుపరచండి. ఉదా: నెలవారీ ఖర్చులైన అద్దె, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, పాలు, నిత్యావసర వస్తువులు మొదలైనవి; మూడు నెలలకు, ఆరు నెలలకు ఉండే పిల్లల స్కూలు ఫీజులు, సంవత్సర ఖర్చులైన ఇంటి పన్ను, ఇన్సూరెన్స్ ప్రీమియం తదితరాలు. మీ ఖర్చులను గమనించి, వాటిలో ఏవి అత్యవసరమైనవి, ఏవి కావలసినవి, ఏవి లగ్జరీ ఖర్చులో విడివిడిగా రాయండి.ఇలా నమోదు చేయడం ద్వారా మీరు అనవసర ఖర్చులు ఎక్కడ పెడుతున్నారో మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. తద్వారా ఖర్చులు చేసేటప్పుడు జాగ్రత్త వహించగలుగుతారు. అలాగే దీర్ఘకాలిక లక్ష్యాలైన పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంత ఇల్లు, రిటైర్మెంట్ సమయానికి కావలసిన ఆదాయం మొదలైన వాటికి నెలవారీగా / సంవత్సరానికీ ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎప్పటి నుండి మొదలు పెట్టాలి? ఎంత అవసరం అవొచ్చు అనే దాన్ని పరిగణనలోకి తీసుకోండి.అత్యవసర నిధిగా కనీసం మూడు నెలల ఖర్చుల మొత్తం మీ బ్యాంకు ఖాతాలో ఉండే విధంగా చూసుకోండి. మీరు బడ్జెట్‌ని ప్రిపేర్ చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యులందరినీ భాగస్వాములను చేయండి. బడ్జెట్‌ని కుటుంబ సభ్యులందరికీ వివరించండి. బడ్జెట్‌ని ప్రిపేర్ చేయడం ఎంత ముఖ్యమో దానికి అనుగుణంగా నడుచుకోవడమూ అంతే ముఖ్యం. ఇక క్రెడిట్ కార్డులు ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా ఖర్చు చేయడం మనం చూస్తూ ఉంటాం. కనుక సాధ్యమైనంత వరకు క్యాష్‌ని / డెబిట్ కార్డుని వినియోగించడం మంచిది. లేదా క్రెడిట్ కార్డు వాడినా మీరు ఏ ఖర్చులనైతే బడ్జెట్లో పొందుపరుస్తారో వాటికి మాత్రమే వాడడం మంచిది. ఈ క్రెడిట్ కార్డుని కూడా బడ్జెట్‌కు అనుగుణంగా వాడితే ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే పరిమితి దాటితే ఆ బిల్లులు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొవలసి ఉంటుంది. మీ వ్యక్తిత్వానికి, నష్ట భయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా మీ ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. ఈ దశలో ముందుగా ఆదాయ వ్యయాలను పర్యవేక్షించడానికి బడ్జెట్‌ను వేసుకోవాలి. ఖర్చులను తగ్గించుకుని పొదుపు పెంచుకోవడం, ఆ నిధుల మొత్తాన్ని వైవిధ్యభరితంగా దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి మహిళా తన, తన కుంటుంబ ఆర్థిక స్వాతంత్య్రాన్ని సాధించగలదు. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
కేసీఆర్ ఫ్యామిలీ బడ్జెట్: రేవంత్ రెడ్డి
-
కేసీఆర్ ఫ్యామిలీ బడ్జెట్: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ పై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగడతామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే మాకు అభ్యంతరం లేదు అని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తే ఏపీ సర్కార్ పై పోరాటానికి తాము సిద్ధమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఆర్ధిక బడ్జెట్ ను మంత్రులకు ఏమాత్రం సంబంధం లేకుండా ప్రవేశపెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. శాసన సభలో ప్రవేశపెట్టేది ప్రజల బడ్జెట్ కాదు.. కేసీఆర్ ఫ్యామిలీ బడ్జెట్ అని రేవంత్ రెడ్డి విమర్శించారు. చెరువుల పునరుద్ధరణ, సాగునీటి పేరుతో హరీష్ 35 వేల కోట్లు, వాటర్ గ్రిడ్, రోడ్ల కోసం కేటీఆర్ కు మరో 35 వేల కోట్లు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఛత్తీస్ ఘడ్ పర్యటనతో ఇప్పటికిప్పుడు ఒక్క యూనిట్ విద్యుత్ వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. తన బంధువుల పవర్ ప్రాజెక్ట్ ల పర్మిషన్ కోసమే కేసీఆర్ చత్తీస్ ఘడ్ పర్యటన చేశారని ఆయన అన్నారు. అవిశ్వాసం అనేది ఇప్పుడు అప్రస్తుతం అని రేవంత్ రెడ్డి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
ఫ్యామిలీ బడ్జెట్
ఇంటి బడ్జెట్ ను నిర్వహించే గృహిణుల ముందు ఎంతటి ఆర్థిక మంత్రులైనా బలాదూరే! ప్రభుత్వ బడ్జెట్లో విశేషంఏముంటుంది? ముందుగా ఖర్చుల చిట్టా తయారు చేసుకోవడం, దానికి తగ్గ ఆదాయాన్ని రాబట్టుకోవడానికి ప్రజల ‘పన్ను’లూడగొట్టడం తప్ప! ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వానికి సుంకాల వంటి వంకలు చాలానే ఉంటాయి. సామాన్యుల బడ్జెట్ అలా కాదు కదా! ఆదాయానికి తగినట్లుగానే ఖర్చులకు కత్తెర వేసుకోవాలి. సర్కారు వారి దయ వల్ల ‘ప్రత్యక్షం’గా.. ‘పరోక్షం’గా ‘పన్ను’పోటును పంటి బిగువున భరించాలి. నిత్యావసరాల ‘ధరా’ఘాతానికి విలవిల్లాడుతూనే బతుకు బండిని నెట్టుకు రావాలి. సంసారమంటే అంతటితోనే సరిపోతుందా? కానే కాదు! ఎప్పటికప్పుడు వచ్చిపడే అవసరాలుంటాయి, ఆపదలు ఉంటాయి. అనుకోకుండా జబ్బుచేస్తే చాలు, డబ్బు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చయిపోతుంది. నెలాఖరుకి చేతిలో చిల్లిగవ్వ మిగలడమే గగనం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఇంటిని నడిపేందుకు గృహిణులు అక్షరాలా ‘ఫ్యామిలీ సర్కస్’ చేస్తున్నారు. మిడిల్‌క్లాస్ పిసినారులం.. నా పేరు ప్రమీల. ఎస్సార్ నగర్లో ఉంటాం. మొన్న నాగార్జున ఇంటర్వ్యూలో నెలకు నాలుగు వేలు సంపాదించేవారు కూడా ఉన్నారట అని బాధపడటం చూశాను. మా అబ్బాయికి నాలుగు వేలే వస్తాయి. వాడికి పెళ్లయ్యింది. పిల్లలు. నేనూ. అందరం కలసి సొంతింట్లో ఉంటాం. కానీ నాలుగు వేలతో బతగ్గలమా? నేను స్కూల్ టీచర్‌గా పని చేస్తూ ఆరు వేలు తెస్తున్నాను. చిన్న పోర్షన్ అద్దెకిస్తే మూడువేలు వస్తున్నాయి. అంతా కలిపి పదిహేను వేలు కూడా కావు. కానీ మాకు కనీసం పదిహేను వేలు కావాలి. సరుకులకు ఐదారు వేలు. కాయగూరలకు మూడు వేలు. పాలకు 1,500, కరెంటు బిల్లు 1,500, పేపరు కేబులూ.. మంచినీళ్లు కూడా కొనుక్కోవాలి. అదో 500. మా అబ్బాయికి, నాకు పెట్రోలు ఖర్చు ఐదారువేలు దాటుతోంది. పైగా నేను ఆస్తమా పేషెంటుని. నెలకు వెయ్యి ఖర్చు చేయకపోతే ఊపిరాడదు. ఇక పిల్లలకు జ్వరం, జలుబు అంటే నాలుగైదు వందలు పోతాయి. ఇవి కాకుండా పండుగలు, బంధువులు వస్తే గుడ్లు తేలేయాల్సిందే. సినిమాలకు, షికార్లకు వెళ్లకుండా ప్రతి రూపాయిని అత్యవసరానికి ఖర్చు పెట్టుకుంటూ మహా పిసినారుల్లా బండిలాగాల్సి వస్తోంది. లేదంటే ఏడాది తిరిగే లోపు ఇంటి ఖర్చులకే లక్షల అప్పులు చేసి అవి తీర్చలేక జబ్బులు తెచ్చుకుంటున్నవారున్నారు. ఆడవాళ్లు ప్రతి ఒక్క ఖర్చు దగ్గరా మగవారితో పోట్లాడుతూ ఇంటిని రావణకాష్టం చేసుకోవడం కూడా చూస్తున్నాను. ఇవి బతుకులా అండీ.. ఎప్పటికి మనం బాగుపడగలం. బంధువుల్ని ఇంటికి రాకుండా ఆపగలమేమో .. చెప్పా పెట్టకుండా వచ్చే రోగాల్ని ఆపగలమా? జాలి, కనికరం లేకుండా గుంజే డాక్టర్లను మార్చగలమా. ఏదో బతికేస్తున్నాం కానీ.. నా మటుకు ఇది పెద్ద వండరేనండీ. ప్రభుత్వాలు మన చేత చేయిస్తున్న సర్కస్ ఇది. - ప్రమీల, టీచర్, ఎస్సార్ నగర్ ఇవాళ జీతమొస్తే... నిన్నే అయిపోతుందండీ చెప్పాలంటే కొంచెం సిగ్గుగా ఉంటుందండీ. ఐదు వేలంటే.. అదొక జీతమా అండీ? ఎన్నిసార్లు లెక్కెట్టినా ఐదే ఉండే ఆ వెయ్యి కాగితాల్ని చూసి ఒక్కోసారి ఏడుపొచ్చేస్తదండీ. మా ఆయన వాచ్మెన్ అండీ. మాదాపూర్ అయ్యప్పకాలనీలో అపార్ట్మెంట్లోనండీ. అందులోనే మాకో గదిచ్చారు. నేనూ మా ఆయన. మాకిద్దరు ఆడపిల్లలండీ. ఒకదానికి పెళ్లయ్యిందండీ. ఇంకోదానికి ఎప్పుడూ ఒళ్లు బాగోదండీ. మా ఆయన ఐదు సంపాదిస్తాడు. అదే మూలకండీ? నేనూ ఒళ్లొంచి నాలుగిళ్లలో పని చేసి ఒక మూడు వేలు సంపాదిస్తానండీ. అంటే మొత్తం ఎనిమిది. వాచ్మెన్ గాబట్టి ఇంటద్దె, కరెంటు లేకపోయినా మిగతావన్నీ ఆ ఎనిమిదితోనే సరిపెట్టుకోవాలండీ. కానీ ఎలాగండీ? బ్రహ్మదేవుడిక్కూడా సాధ్యపడదండీ. ఇంటి సరుకులకే మూడు వేలా? కాయగూరలకు వెయ్యి. ఆసుపత్రికి నెలకీ, రెండు నెలలకీ వెయ్యో.. రెండు వేలో దోసిట్లో పోసి రావలసిందే కదండీ. ఇంక ఎవరైనా చుట్టాలొస్తే చికెనో మటనో అంటారు. ఏమున్నా లేకపోయినా మర్యాదలు తప్పవు కదండీ. అదో ఖర్చు. పెళ్లి చేసి పంపాక చేతులు దులుపుకున్నట్టు కాదుగదండీ. ఆడపిల్ల అమ్మగారింటికి రాకుండా ఎట్టా కుదురుద్దండీ? అప్పుడప్పుడు మా పెద్దమ్మాయి వస్తూపోతుండాల్సిందే. మనమరాలికి అంతో ఇంతో ఖర్చు పెట్టాల్సిందే. ఆ మధ్యన ఊరి నుంచి చుట్టాలొచ్చి సిన్మాకెల్దాం అన్నారు. మనింటికొచ్చిన చుట్టాలతోటి మనం టికెట్టు పెట్టిస్తామా? అయ్యో.. వొదినా ఈ ఊళ్లో టికెట్లు మూడ్రోజుల ముందే ఇచ్చేస్తారు అని తప్పించుకున్నామండీ. అసలు మాటేమిటంటే అండీ.. ఈ బతుకులో సినిమా సాధ్యమా అండీ. ఊరుగాని ఊళ్లో బతుకుతున్నాం. సొంత ఊరి నుంచి ఎప్పుడు ఏ కబురొస్తుందో అని ఎప్పుడూ ఒకే దడండీ. ఒక మంచికైనా.. ఒక చెడ్డకైనా పోవాల్సిందే కదా. పోవాలంటే ఎవరి దగ్గరైనా చార్జీలకు చేయి సాపాల్సిందే కదా. ఆదాయం పది రూపాయలు పెరిగితే .. ఖర్చులు పాతిక రూపాయలు పెరుగుతున్నాయి. పోనీ ఈ పని కాదు ఇంకో పని చేసుకుందాం అంటే.. బయట అద్దెలు చూశారు గదండీ. అవి అద్దెలు కాదండీ మాలాంటోళ్లని మింగేసే అగ్గిగుండాలు. ఇదండీ మా బతుకు. ఎవరితో చెప్పుకుంటామండీ. మీతో చెప్పుకుందామంటే మీకేమైనా తక్కువ బాదుంటాదా అండీ! - లక్ష్మి, వాచ్మెన్ భార్య, మాదాపూర్ మినిమమ్ 25 థౌజండ్స్ ఈ సిటీలో ఓ సామాన్యుడు అప్పు లేకుండా బతకాలంటే తక్కువలో తక్కువ పాతికవేలు కావాలి. అంతకు తక్కువ సంపాదిస్తున్నాడంటే అతడు అశాంతితో ఉన్నాడనే. నేను చూస్తున్నాను కదా.. మా ఇంట్లో ఎంత జాగ్రత్తగా చేసినా నెలకు పాతిక వేలు అవుతోంది. నా పేరు సునంద. క్యాటరింగ్ వ్యాపారం చేస్తున్నాను. భర్త చనిపోయాడు. ఈ మధ్యనే కోడలు కూడా అనారోగ్యంతో కన్నుమూసింది. పిల్లలు, మనవలతో ఇంట్లో ఐదుగురం ఉంటాం. ఇంటి అద్దె ఆరువేల రూపాయలు. రేషన్ పది వేలవరకూ అవుతుంది. కాయగూరలు మూడు వేలు, కరెంటు బిల్లు రెండు వేల రూపాయలు. పాలకు 1,500. పేపరు, కేబుల్, వాటర్ బిల్లులు 600 వరకూ ఉంటాయి. జ్వరం, జలుబులైతే నెలకు ఐదారొందలవుతుంది. ఏదైనా చిన్న చిన్న వైద్యాల అవసరం పడిందంటే నెలకు రెండు మూడు వేలకు పైగా ఆసుపత్రి ఖర్చు ఉంటుంది. ఇవి కాకుండా పండుగలపుడు, బంధువులొచ్చినపుడు ఖర్చు నాలుగైదు వేలకు తక్కువవదు. మా ఇంట్లో సినిమాలకు, షికార్లకు పెద్దగా వెళ్లం కాబట్టి సరిపోతుంది. లేదంటే వాటి బిల్లులు కూడా తక్కువగా లేవు. మా పక్కింటివారు ఎప్పుడు ఐమాక్స్ వెళ్లొచ్చినా వెయ్యి నుంచి పదిహేను వందలవుతుందని చెబుతుంటారు. ఇక ఏడాదికి నాలుగైదు సార్లయినా షాపింగ్ తప్పదు. అలాంటివాటికి పొదుపు చేసిన డబ్బునే వాడుతుంటాం. ఒక్కోసారి బడ్జెట్ దాటితే మాత్రం వచ్చే నెల లోటు బడ్జెట్‌కి సిద్ధపడాలి. - సునంద, క్యాటరర్, సనత్‌నగర్. రెండు పదుల పేదవాడు... మొన్నటివరకూ పాతికవేల జీతమంటే ఉన్నవాడి కింద జమకట్టేవారు. ఇప్పుడది పేదవాడి బడ్జెట్‌గా మారిపోవడం చూస్తుంటే.. భవిష్యత్తు ఇంకెంత భయంకరంగా ఉంటుందోనని భయమేస్తుంది. భర్త చేతినిండా సంపాదిస్తున్నా.. ఇచ్చిన రూపాయిని ఎలా ఖర్చుపెట్టాలో, ఎంత ఖర్చు పెట్టాలో తెలియక అయోమయంలో పడుతున్న మహిళల ఇబ్బంది గురించి నాకు బాగా తెలుసు. నేను సినిమాల్లో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. ఇంటి సరుకులు స్వయంగా వెళ్లి కొనుక్కుంటాను. వంట సరుకులకు ఒకో నెల పదివేలవుతుంది. ఉన్నట్టుండి బిల్లు పదిహేనువేలు వస్తుంది. చెప్పాపెట్టకుండా.. పెరిగే ధరలు మాకే ఇబ్బంది కలిగిస్తే.. సామాన్య మహిళల సంగతేంగాను. ఆ మధ్యనెవరో చెప్పారు.. ఉల్లిపాయల ధర పెరిగినపుడు ఉల్లివాడటం తగ్గించేస్తే సరి అని. నాకు నిజమేననిపించింది. అంతకంటే ఏం చేయగలం. ఉల్లిపాయ లేకుండా కూరలు వండితే వచ్చే నష్టమేమీ లేదు కదా! ధరలను ఎలాగూ నియంత్రించలేం. కనీసం ఖర్చుల్లోనైనా రూపాయి, రెండు రూపాయలు మిగుల్చుకునే ప్రయత్నం చేసుకోవాలి. చీటికీ మాటికీ ఆస్పత్రి బాటపట్టకుండా పిల్లల ఆరోగ్యాలను కాపాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉన్నా.. అకస్మాత్తుగా వచ్చే జబ్బులు వస్తూనే ఉంటాయి. పెద్ద జబ్బుల వైద్యం ఖర్చు భరించే శక్తి సామాన్యులకు కాదు కదా.. ఓ మోస్తరువారు కూడా తట్టుకోలేకపోతున్నారు. పేదలు, సామాన్యుల వైద్యం కోసం, ఆహారం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే.. పేదవాడికి మిగిలేది అర్ధాకలి, అర్ధాయుష్షు! విద్యను కూడా లక్షలు పోసి కొనుక్కునే పరిస్థితి పేదవాడ్ని మరింత కుంగదీస్తోంది. - జయసుధ, మాజీ ఎమ్మెల్యే