
యంత్రాల్లేవు... ఇంటర్నెట్టూ లేదు..!
దేశంలో పెద్ద నగరాల్లో కూడా ఇప్పుడిప్పుడే డిజిటల్ లావాదేవీలు, మొబైల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు ప్రాచుర్యంలోకి వస్తున్నారుు.
దేశంలో పెద్ద నగరాల్లో కూడా ఇప్పుడిప్పుడే డిజిటల్ లావాదేవీలు, మొబైల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు ప్రాచుర్యంలోకి వస్తున్నారుు. ఇక చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి లావాదేవీలను ఆచరణలోకి తేవడం అంత తేలికేమీ కాదు. ఎర్నస్ట్ అండ్ యంగ్ కన్సల్టెన్సీ సంస్థ అధ్యయనం ప్రకారం కార్డ్‌లను స్వైప్ చేసే మెషిన్లు.. (పారుుంట్ ఆఫ్ సేల్) టెర్మినల్స్ సంఖ్య చాలా తక్కువున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. 70% పీవోఎస్ టెర్మినల్స్ దేశంలోని టాప్-15 నగరాల్లోనే ఉన్నారుు.
మొత్తం లావాదేవీల పరిమాణంలో వీటి వాటా 75%కి పైగా ఉంటోంది. పెపైచ్చు మన దగ్గర బ్యాంకింగ్ సదుపాయాలు సైతం భారీ స్థారుులో కార్డు లావాదేవీలను తట్టుకునేలా లేవు. చాలా సందర్భాల్లో పీవోఎస్ టెర్మినల్స్ సరిగ్గా పనిచేయక మళ్లీ డబ్బుతోనే చెల్లించాల్సిన పరిస్థితి ఉంటోంది. ఇక ఇంటర్నెట్ కనెక్టివిటీ మరో సమస్య. ఇప్పటికీ చాలా చోట్ల ఇంటర్నెట్ సరిగ్గా లేదు. దీంతో మొబైల్ వాలెట్ లాంటి వాటిలో డబ్బులున్నా లావాదేవీలు చేసేందుకు ఆస్కారం ఉండని పరిస్థితి.
డిజిటల్ పెరుగుతున్నప్పటికీ...
దేశీయంగా డిజిటల్ చెల్లింపుల పరిమాణం పెరుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. గణాంకాల ప్రకారం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్‌సఫర్ (నెఫ్ట్) రూపంలో ఆన్‌లైన్ లావాదేవీలు 2009-10లో సుమారు రూ.4 లక్షల కోట్లుండగా.. 2015-16లో రూ.83 లక్షల కోట్లకు చేరారుు. ఇప్పుడు కొత్తగా వాలెట్లు కూడా అందుబాటులోకి వస్తున్నారుు. అరుునప్పటికీ.. చిన్నా, చితక పనులకు అవసరమయ్యే ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు మొదలైన వారికి చెల్లించే చిన్న మొత్తాలకు నగదు కాకుండా చెక్కులు, నెఫ్ట్ లు వాడితే లావాదేవీ భారం మరింత పెరుగుతుందనేది నిపుణుల మాట. కాబట్టి, డిజిటల్ మాధ్యమంలో అదనపు ఖర్చుల భారాన్ని దృషి ్టలో ఉంచుకుని లావాదేవీలు నిర్వహించడం శ్రేయస్కరమనేది వారి సూచన.