మార్కెట్‌ జంప్‌ : మెటల్‌, బ్యాంక్స్‌ మెరుపులు | Sensex Nifty  opens Higher Led By Gains In Metal Banking Shares | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ జంప్‌ : మెటల్‌, బ్యాంక్స్‌ మెరుపులు

Dec 13 2019 9:38 AM | Updated on Dec 13 2019 9:39 AM

Sensex Nifty  opens Higher Led By Gains In Metal Banking Shares - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ఆరంభంలోనే రెండువందల పాయింట్లకు పైగా జంప్‌ చేసాయి. దీంతో నిఫ్టీ  తిరిగి 12వేల స్థాయిని నిలబెట్టుకుంది. ఒక దశలో 300 పాయింట్లు జంప్‌ చేసిన సెన్సెక్స్‌  42800 పైగి ఎగిసింది.  ప్రస్తుతం 237 పాయింట్ల లాభంతో 40814 వద్ద, నిఫ్టీ 62  పాయింట్లు  ఎగిసి 12035 వద్ద  కొనసాగుతోంది.  జీఎస్‌టీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలతో  దాదాపు అన్ని రంగాలు ఉత్సాహంగా ఉన్నాయి.  ముఖ్యంగా  మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లు కొనుగోళ్లతో కళ కళలాడుతున్నాయి. టాటామోటార్స్‌, వేదాంతా, టీఎంల్‌-డి, యస్‌బ్యాంకు,టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, ఎం అండ్‌ ఎం, మారుతి సుజుకి  భారీగా లాభపడుతున్నాయి. మరోవైపు డా. రెడ్డీస్‌, బీపీసీఎల్‌, జీ, భారతి ఎయిర్‌టెల్‌​, సిప్లా, బ్రిటానియా, ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ నష్టపోతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement