స్టాక్ మార్కెట్ లో కొనసాగుతున్న సెన్సెక్స్ హవా! | Sensex hits record high for fifth consecutive day | Sakshi
Sakshi News home page

స్టాక్ మార్కెట్ లో కొనసాగుతున్న సెన్సెక్స్ హవా!

Mar 28 2014 4:24 PM | Updated on Oct 4 2018 5:15 PM

స్టాక్ మార్కెట్ లో కొనసాగుతున్న సెన్సెక్స్ హవా! - Sakshi

స్టాక్ మార్కెట్ లో కొనసాగుతున్న సెన్సెక్స్ హవా!

భారత స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో రోజు కూడా లాభాలతో పరుగులు పెట్టింది.

భారత స్టాక్ మార్కెట్ వరుసగా ఐదో రోజు కూడా లాభాలతో పరుగులు పెట్టింది. బ్యాకింగ్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో ప్రధాన సూచీలు నూతన గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. ఓదశలో సెన్సెక్స్ 22363 పాయింట్ల, నిఫ్టీ 6702 పాయింట్ల ఇంట్రాడే గరిష్టస్థాయిని తాకాయి. చివరకు సెన్సెక్స్ 125  పాయింట్ల లాభంతో 22339 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 6695 వద్ద ముగిసాయి. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో పీఎన్ బీ అత్యధికంగా 6.42 శాతం లాభపడగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, టాటా పవర్, హిండాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల షేర్లు 4 శాతానికి పైగా లాభాన్ని నమోదు చేసుకున్నాయి. కెయిర్న్ ఇండియా, బజాజ్ ఆటో, ఓఎన్ జీసీ, ఐటీసీ, జిందాల్ స్టీల్ కంపెనీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. 
 
అంతర్జాతీయ మార్కెట్ లో గత ఎనిమిది నెలలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయిని రూపాయి నమోదు చేసుకుంది. డాలర్ వ్యతిరేకంగా రూపాయి 59.90 వద్ద ముగిసింది. ఎనిమిది నెలల్లో తొలిసారి 60 రూపాయల దిగువన ముగిసింది. 
 
బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ ను తొలగిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయనకు చెందిన ఇండియా సిమెంట్స్ కంపెనీ అనూహ్యంగా 9.18 శాతం లాభపడి 60.05 వద్ద ముగియడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement