దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగుతోంది.
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ 110 పాయింట్లకు పైగా లాభాల్లోనూ, నిఫ్టీ 20 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా స్టాక్ మార్కెట్లు మంగళవారం కొత్త రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే ట్రేడింగ్‌లో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. కొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి.