మార్కెట్లో సుప్రీం సెగ : బ్యాంకులు, టెల్కోలు ఢమాల్‌  | Sensex Falls 38 Points, Nifty Settles Below 11,600  | Sakshi
Sakshi News home page

మార్కెట్లో సుప్రీం సెగ : బ్యాంకులు, టెల్కోలు ఢమాల్‌ 

Oct 24 2019 4:59 PM | Updated on Oct 24 2019 5:06 PM

Sensex Falls 38 Points, Nifty Settles Below 11,600  - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిసాయి. లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులతో  కొనసాగాయి. వరుసగా రెండో రోజూ దేశీయ సూచీలు లాభాల్లో  ఆరంభమై, సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 39200 వేలకు, నిఫ్టీ 11600 ఎగువకు చేరాయి అదే స్థాయిలోమళ్లి నష్టపోయాయి. చివరకు సెన్సెక్స్‌ 38 పాయింట్లు నష్టంతో 39 వేల ఎగువన  ముగిసింది.  నిఫ్టీ 22 పాయింట్లు నష్టంతో 11600 దిగువన క్లోజ్‌ అయింది.

రియాల్టీ స్టాక్స్ మినహా దాదాపు అన్ని రంగాల షేర్ల నష్టపోయాయి. ముఖ్యంగా టెలికాం కంపెనీలకు భారీ షాక్‌ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో టెలికం షేర్లతోపాటు, వాటికి అప్పులిచ్చిన బ్యాంకింగ్‌ రంగ షేర్లు కూడా భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఎస్‌బ్యాంకు, పీఎన్‌బీ, కోట్‌ మహీంద్ర బ్యాంకు,  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు,  ఆర్‌బీఎల్‌, ఇండస్‌ ఇండ్‌బ్యాంకు తదితర  బ్యాంకు లు భారతీయ టెలికాం కంపెనీలకు పెద్ద ఎత్తున రుణాలిచ్చాయి. భారతి ఇన్‌ఫ్రాటెల్‌, గ్రాసిం, ఎస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ భారీగా నష్టపోయాయి. అనైతిక విధానాల ఆరోపణలతో ఇబ్బందుల్లోపడిన ఇన్ఫోసిస్‌పై సెబీకి దర్యాప్తు ప్రారంభించిందన్న వార్తలతో ఇన్వెస్టర్లు ఇన్ఫీ షేర్లలో అమ్మకాలకు దిగారు. దాదాపు 10శాతానికిపైగా  నష్టపోయిన భారతీ ఎయిర్‌టెల్ ముగింపులో లాభపడింది. ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, టైటన్ , రిలయన్స్‌ లాభాల్లో ముగిశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement