చివరికి ఫ్లాట్‌ | Sensex ends flat but Midcap outperforms | Sakshi
Sakshi News home page

చివరికి ఫ్లాట్‌

Sep 7 2017 3:58 PM | Updated on Sep 12 2017 2:10 AM

రోజంతా లాభాల్లో ట్రేడైన స్టాక్‌ మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి.

సాక్షి, ముంబై : రోజంతా లాభాల్లో ట్రేడైన స్టాక్‌ మార్కెట్లు చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 0.77 పాయింట్ల లాభంలో 31,662.74 వద్ద, నిఫ్టీ 13.70 పాయింట్ల లాభంలో 9900 ఎగువన 9,929.90 వద్ద క్లోజయ్యాయి.  ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నిఫ్టీ 9,950ను అధిగమించినప్పటికీ ఆ స్థాయిలో నిలవలేకపోయింది. 9,965-9,917 పాయింట్ల మధ్య పరిమిత స్థాయిలో ఊగిసలాడింది. సెన్సెక్స్‌ సైతం తొలుత 125 పాయింట్ల వరకూ జంప్‌చేసినప్పటికీ తదుపరి స్వల్ప లాభాల మధ్యనే నడిచి, చివరికి 0.77 పాయింట్ల లాభంలో ముగిసింది. నేటి మార్కెట్‌లో మెటల్‌ ఇండెక్స్‌ మంచి లాభాలను గడించింది.
 
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.5-0.8 శాతం లాభపడ్డాయి. టాప్‌ గెయినర్లుగా  ఎం అండ్‌ ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, ఐషర్‌ మోటార్స్‌ నిలువగా.. టాటా మోటార్స్‌, టాటా మోటార్స్‌ డీవీఆర్‌, బీపీసీఎల్‌ ఎక్కువగా నష్ట పోయాయి. అటు బ్యాంకు నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. వరుసగా నాలుగు సెషన్ల నుంచి ఐటీసీ షేర్లు 4 శాతం పైగా కిందకి పడిపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.07 పైసలు బలపడి 64.04గా ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 70 రూపాయల లాభంలో 30,145 రూపాయలుగా నమోదయ్యాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement