
సాక్షి,ముంబై: దేశీయ మార్కెట్లు చివరకు లాభాల్లో ముగిసాయి.అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రికత్త వాతావరణంనేపథ్యంలో గ్లోబల్‌మార్కెట్లతోపాటు దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. అయితే కొద్దిగా చమురు ధరలు చల్లబడటంతో మంగళవారం ఈ నష్టాలనుంచి కోలుకున్న కీలక సూచీ సెన్సెక్స్ 500పాయింట్లు ఎగిసింది. కానీ మిడ్ సెషన తరువాత లాభాల స్వీకరణతో లాభాలను కోల్పోయింది. చివరికి 192 పాయింట్ల లాభంతో 40869 వద్ద సెన్సెక్స్, నిఫ్టీ 60 పాయింట్లు ఎగిసి12052 వద్ద స్థిరపడ్డాయి. అయితే సెన్సెక్స్ 41వేల దిగువనే ముగిసింది. అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, ఎన్‌టిపిసి టాప్ విన్నర్స్‌గా నిలవగా, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, భారతి ఎయిర్టెల్, నెస్లే హీరో మోటోకార్ప్ నష్టపోయాయి.