హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌

SEBI GreenSignal for HDFC Life IPO

ఇష్యూ పరిమాణం రూ.7,500 కోట్లు!  

న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ పచ్చజెండా ఊపింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.7,500 కోట్లు సమీకరించవచ్చని మర్చంట్‌ బ్యాంకర్ల సమాచారం. ఈ ఐపీఓలో భాగంగా దాదాపు 15 శాతానికి సమానమైన 29 కోట్లకు పైగా షేర్లను జారీ చేయనున్నారు.

దీంట్లో హెచ్‌డీఎఫ్‌సీ 9.55 శాతం వాటాకు సమానమైన 19.12 కోట్ల షేర్లను, స్టాండర్డ్‌ లైఫ్‌ మారిషస్‌ 5.42 శాతం వాటాకు సమానమైన 10.85 కోట్ల షేర్లను ఆఫర్‌ చేస్తాయి. హెచ్‌డీఎఫ్‌సీ స్డాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో హెచ్‌డీఎఫ్‌సీకి 61.4 శాతం, స్టాండర్డ్‌ లైఫ్‌ కంపెనీకి 34.86 శాతం చొప్పున వాటాలున్నాయి.

గత నెలలోనే న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌ కంపెనీ ఐపీఓకు సెబీ ఆమోదం లభించింది. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లో రెండు బీమా కంపెనీలు– ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ మాత్రమే లిస్టయ్యాయి. ఇటీవలే ఐపీఓకు వచ్చిన జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ షేర్లు వచ్చే వారం స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ కానున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top