ఆర్థిక ఫలితాల సమర్పణకు గడువు పొడిగింపు

Sebi further extends deadline to file Q4 results till July 31 - Sakshi

మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ తాజా నిర్ణయం

కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తి ప్రభావంతో కంపెనీల ఆర్థిక ఫలితాల సమర్పణ గడువును మరో నెలరోజుల పాటు పొడిగిస్తున్నట్లు సెబీ తెలిపింది. ఆయా కంపెనీలు తమ త్రైమాసిక, అర్థ, వార్షిక ఆర్థిక ఫలితాల గణాంకాలను సమర్పించేందుకు కాలపరిమితిని జూలై 31వరకు పొడగిస్తున్నట్లు మార్కెట్‌ రెగ్యూలేటరీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. లాక్‌డౌన్‌తో నేపథ్యంలో గతంలో కంపెనీల ఫలితాలను జూన్‌ 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ గడువును జూన్‌ 31వరకు పొడిగిస్తున్నట్లు సెబీ పేర్కోంది. 

అనేక లిస్టెడ్‌ కంపెనీలు, ప్రముఖ ఛార్టర్డ్‌ అకౌంటెంట్లు, ఆయా పరిశ్రమ సంస్థలు అభ్యర్థన మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్న సెబీ పేర్కోంది. ఆయా కంపెనీల అనుబంధ, భాగస్వామ్య సం‍స్థలు కంటెన్మెంట్‌ జోన్లలో ఉండటం వల్ల అడిట్‌ ప్రక్రియతో ఇతర నిర్వహణ సవాళ్లను దృష్ట్యా కంపెనీలకు ఈ వెసులుబాటును కలిగిస్తున్నట్లు సెబీ తెలిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top