సౌదీ ఆరామ్‌కో.. అతి పెద్ద ఐపీఓ! | Saudi Arabia sweetens huge Aramco IPO with tax cut Reuters | Sakshi
Sakshi News home page

సౌదీ ఆరామ్‌కో.. అతి పెద్ద ఐపీఓ!

Mar 29 2017 1:05 AM | Updated on Aug 20 2018 7:33 PM

సౌదీ ఆరామ్‌కో.. అతి పెద్ద ఐపీఓ! - Sakshi

సౌదీ ఆరామ్‌కో.. అతి పెద్ద ఐపీఓ!

ప్రపంచంలో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూకు రంగం సిద్ధమవుతోంది.

5,000 కోట్ల డాలర్లుగా అంచనా..
లండన్‌: ప్రపంచంలో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూకు రంగం సిద్ధమవుతోంది. సౌదీ అరేబియాకు చెందిన ‘సౌదీ ఆరామ్‌కో’ ఐపీఓ ద్వారా కంపెనీలోని 5 శాతం వాటా షేర్లను విక్రయించనున్నది. వచ్చే ఏడాది ఈ ఐపీఓ ఉండొచ్చని అంచనా. కాగా, ఐపీఓ నేపథ్యంలో కంపెనీ పన్ను భారాన్ని గణనీయంగా సౌదీ ప్రభుత్వం తగ్గించింది.  పన్ను రేటును 85% నుంచి 50%కి తగ్గించాలని నిర్ణయించింది.

తాజా పన్ను రేటు ప్రకారం ఈ కంపెనీ విలువ సుమారుగా 2 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా. దీంట్లో  సగం ఉన్నప్పటికీ, ఈ కంపెనీ ఐపీఓ ప్రపంచంలోనే అతి పెద్ద ఐపీఓ కానున్నదని నిపుణులంటున్నారు. ఐపీఓలో 5 శాతం వాటా విక్రయం వల్ల 5,000 కోట్ల డాలర్ల(దాదాపు రూ.3.25 లక్షల కోట్లు) ఆదాయం సౌదీ ప్రభుత్వానికి లభిస్తుంది.

  కాగా ఇప్పటిదాకా అతి పెద్ద ఐపీఓగా 2014లో వచ్చిన 2,500 కోట్ల డాలర్ల ఆలీబాబా ఐపీఓనే రికార్డ్‌ సృష్టించింది. ముడి చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి  బయటపడటానికి సౌదీ అరేబియా చేస్తున్న సంస్కరణలకు ఇతోధిక తోడ్పాటు ఈ ఐపీఓ నిధులతో లభించగలదని అంచనా. ఈ కొత్త పన్ను రేటుతో తమ కంపెనీ అంతర్జాతీయ ప్రమాణాలకు వచ్చినట్లయిందని సౌదీ ఆరామ్‌కో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌  అ మిన్‌ నాసర్‌ చెప్పారు.  సౌదీ ఆరామ్‌కో కంపెనీ రో జుకు కోటి బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement