శాంసంగ్‌ హై-ఎండ్‌ ఫ్లిప్‌ఫోన్‌, ధర ఎంతో తెలుసా?

Samsung W2019 unveiled: High-end flip phone comes with flagship specs    - Sakshi

శాంసంగ్‌ ‘డబ్ల్యూ 2019’  చైనాలో లాంచ్‌

డ్యుయల్‌ డిస్‌ప్లే, డ్యుయల్‌ రియర్‌ కెమెరా

బీజింగ్‌: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ శాంసంగ్ ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్  చైనా మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. ‘డబ్ల్యూ 2019’ పేరుతో  హైఎండ్‌ ఫ్లిప్‌మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్‌ సూపర్‌ డిస్‌ప్లే, డ్యుయల్‌ రియర్‌ కెమెరా,  స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్‌ ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. పుల్‌ బాడీ 3డీ గ్లాస్ మెటల్ డిజైన్‌తో రూపొందించిన ఈ డివైస్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసింది. రోజ్‌ గోల్డ్, ప్లాటినం కలర్ వేరియెంట్లలో  లభ్యమవుతున్న  శాంసంగ్ డబ్ల్యూ 2019 స్మార్ట్‌ఫోన్  ధర ఎంతో తెలుసా?  సుమారు రూ.1,97060 గా ఉంది.  

శాంసంగ్ డబ్ల్యూ2019 ఫీచర్లు
4.2 ఇంచ్ సూపర్ అమోలెడ్ డ్యుయల్  (ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌) డిస్‌ప్లేలు
1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
6జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్
512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
12+12 ఎంపీ  డ్యుయల్ బ్యాక్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3070 ఎంఏహెచ్ బ్యాటరీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top