శాంసంగ్‌లో 1,200 నియామకాలు | Samsung to recruit 1,200 engineers from IITs, BITS for India | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌లో 1,200 నియామకాలు

Nov 28 2019 6:09 AM | Updated on Nov 28 2019 6:09 AM

Samsung to recruit 1,200 engineers from IITs, BITS for India - Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాదిలో 1200 మంది ఇంజినీరింగ్‌ పట్టభద్రులను ఉద్యోగాల్లోకి తీసుకోనున్నట్లు ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ సంస్థ శాంసంగ్‌ బుధవారం ప్రకటించింది. పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో పనిచేయడం కోసం వీరిని ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌సీల నుంచి ఎంపికచేయనున్నట్లు వెల్లడించింది. బెంగళూరు, నోయిడా, ఢిల్లీ కేంద్రాల్లో నియామకాలు ఉంటాయని వివరించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, డీప్‌ లెర్నింగ్, ఇమేజ్‌ ప్రాసెసింగ్, క్లౌడ్, ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్, రికగ్నిషన్‌ సిస్టమ్స్, డేటా అనాలిసిస్, ఆన్‌డెవైస్‌ ఏఐ, మొబైల్‌ కమ్యూనికేషన్స్, నెట్‌వర్క్స్, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ వంటి విభాగాల్లో వీరు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement