ఇంటిని అద్దెకిస్తే రూ. కోటి బీమా | Renting houses made easier | Sakshi
Sakshi News home page

ఇంటిని అద్దెకిస్తే రూ. కోటి బీమా

Jul 15 2017 6:30 AM | Updated on Sep 5 2017 4:02 PM

ఇంటిని అద్దెకిస్తే రూ. కోటి బీమా

ఇంటిని అద్దెకిస్తే రూ. కోటి బీమా

కొత్త ఇంటికి బీమా తీసుకోవటం మనకు తెలిసిందే. కానీ, అద్దెకిచ్చే ఇంటికీ ఉచిత బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది నెస్ట్‌అవే.

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కొత్త ఇంటికి బీమా తీసుకోవటం మనకు తెలిసిందే. కానీ, అద్దెకిచ్చే ఇంటికీ ఉచిత బీమా సదుపాయాన్ని కల్పిస్తోంది నెస్ట్‌అవే. ఆన్‌లైన్‌ కేంద్రంగా ఇంటి అద్దెల విభాగంలో ఉన్న నెస్ట్‌అవే ఇంటి యజమానులకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం నెస్ట్‌అవేలో 11 వేల ఇళ్లు నమోదుకాగా..

ఇందులో 25 వేల మంది అద్దెకుంటున్నారని, వీటిల్లో హైదరాబాద్‌లో 1,200 ఇళ్లు, 3,300 మంది అద్దెకుంటున్నారని శుక్రవారమిక్కడ జరిగిన సమావేశంలో అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ కిశోర్‌ సింగ్‌ తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, పుణె, హైదరాబాద్, ఘజియాబాద్, ముంబై నగరాల్లో సేవలందిస్తున్నామని.. ఏడాదిలో విజయవాడతో పాటూ చెన్నై నగరాల్లో సేవలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఐడీజీ, టైగర్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థల నుంచి 43.2 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement