ఎల్‌వీబీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ విలీనానికి ఆర్‌బీఐ నో | RBI Rejects LVB And Indiabulls Housing Merger | Sakshi
Sakshi News home page

ఎల్‌వీబీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ విలీనానికి ఆర్‌బీఐ నో

Oct 10 2019 8:50 AM | Updated on Oct 10 2019 8:50 AM

RBI Rejects LVB And Indiabulls Housing Merger - Sakshi

న్యూఢిల్లీ: లక్ష్మీ విలాస్‌ బ్యాంకు(ఎల్‌వీబీ)లో, గృహ రుణాల సంస్థ ఇండియాబుల్స్‌ ఫైనాన్స్‌ విలీన ప్రతిపాదనకు ఆర్‌బీఐ అనుమతిని నిరాకరించింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్, ఇండియాబుల్స్‌ కమర్షియల్‌ క్రెడిట్‌లను లక్ష్మీ విలాస్‌ బ్యాంకులో స్వచ్ఛంద విలీనానికి చేసుకున్న దరఖాస్తును ఆమోదించడం లేదంటూ ఆర్‌బీఐ ఈ నెల 9న(బుధవారం) లేఖ ద్వారా తెలియజేసినట్టు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లకు లక్ష్మీ విలాస్‌ బ్యాంకు తెలియజేసింది. విలీనానికి అనుమతి కోరుతూ ఎల్‌వీబీ ఈ ఏడాది మే 7న దరఖాస్తు చేయడం గమనార్హం. కాగా, భారీగా ఎగబాకిన మొండిబకాయిలు, తగినంత మూలధనం లేకపోవడం వంటి ప్రతికూలతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎల్‌వీబీపై ఇటీవలే ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement