రెండవ జాబితా: 40 కంపెనీలకు షాక్‌! | RBI readies second list of 40 loan defaulters to be hauled to NCLT | Sakshi
Sakshi News home page

రెండవ జాబితా: 40 కంపెనీలకు షాక్‌!

Published Tue, Aug 29 2017 2:03 PM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

రెండవ జాబితా: 40 కంపెనీలకు షాక్‌! - Sakshi

రెండవ జాబితా: 40 కంపెనీలకు షాక్‌!

కేంద్ర బ్యాంకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్పొరేట్ల నుంచి మొండిబకాయిలను రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా మరో జాబితాను సిద్ధం చేసింది.

న్యూఢిల్లీ: భారీ రుణ ఎగవేతదారులకు షాకిచ్చే దిశగా కేంద్ర బ్యాంకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  వేగంగా కదులుతోంది. కార్పొరేట్ల నుంచి మొండిబకాయిలను రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా  ఆర్‌బీఐ మరో జాబితాను సిద్ధం చేసింది.  దాదాపు 30-40 కంపెనీలతో కూడిన రెండవ జాబితాను  త్వరలోనే విడుదల చేయనుంది.  ఇందులో భాగంగా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో కేసు దాఖలు  చేయనుంది.

ఎకానమిక్స్‌ టైమ్స్‌  నివేదిక ప్రకారం రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ సెప్టెంబర్‌ లో ఈ రెండవ జాబితాను  బహిర్గతం చేయనుందని తెలుస్తోంది.   వీటిలో ముఖ్యంగా   ఇన్‌ఫ్రాస్ట్రక‍్చర్‌, పవర్‌ సెక్టార్‌ కంపెనీలు  ఉండనున్నాయి. ఉత్తమ్‌ గాల్వా, వీడియోకాన్‌, విసా స్టీల్‌, కాస్టెక్స్‌ టెక్నాలజీస్‌ , జెఎస్‌పీఎల్‌ తదితర కంపెనీలు ఇందులో ఉండనున్నాయి. 

కాగా ఈ వార్తలపై స్పందించడానికి   ఉత్తం గాల్వా, వీడియో కాన్‌ కంపెనీ ప్రతినిధులు నిరాకరించారని  ఎకానమిక్స్‌ టైమ్స్‌ రిపోర్ట్‌ చేసింది.  ఈ అంచనాలపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement