డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించిన ఆర్‌బీఐ

RBI Files Insolvency Application Against DHFL At Mumbai NCLT - Sakshi

దివాలా పరిష్కారం కోరుతూ పిటిషన్‌

ముంబై: సంక్షోభంలో చిక్కుకున్న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ విషయంలో కార్పొరేట్‌ దివాలా పరిష్కార చర్యలు ప్రారంభించాలని కోరుతూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెంచ్‌ ముందు ఆర్‌బీఐ శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేసింది. దివాలా అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ)లోని సెక్షన్‌ 227 కింద చర్యలు చేపట్టాలని కోరింది. దివాలా పరిష్కార దరఖాస్తు అనుమతించడం లేదా తిరస్కరించేంత వరకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సంస్థ రుణ చెల్లింపులపై తాత్కాలిక విరామం (మారటోరియం) ఉంటుందని ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది.

గత నెల 20న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బోర్డును ఆర్‌బీఐ రద్దు చేయడంతోపాటు, ఆర్‌ సుబ్రమణియన్‌ను అడ్మిని్రస్టేటర్‌గా నియమించడం తెలిసిందే. దీంతో పాటు, ముగ్గురు నిపుణులు.. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ రాజీవ్‌లాల్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ ఎన్‌ఎస్‌ కన్నన్, యాంఫి సీఈవో ఎన్‌ఎస్‌ వెంకటేశ్‌తో ఒక అడ్వైజరీ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. ఈ బోర్డు సుబ్రమణియన్‌కు సహకారం అందించనుంది. ఐబీసీ కింద ఎన్‌సీఎల్‌టీ వద్ద దివాలా చర్యలు ఎదుర్కోనున్న తొలి బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కానుంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top