రైల్వే టికెట్ బుకింగ్‌లో  కొత్త ఆప్షన్‌ ఏంటో తెలుసా?

Railway Tickets’ T(M/F) Option to Soon Be Modified to Just ‘T’ for Transgender People

సాక్షి, న్యూఢిల్లీ:  థర్డ్‌ జెండర్‌ కోసం  భారతీయ  రైల్వే  కొత్త ఆప్షన్‌ ను పరిచయం  చేస్తోంది.  రైల్వే టికెట్  రిజర్వేషన్లో  ట్రాన్స్ జెండర్లకు  అవకాశం కల్పించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.   ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌జెండర్  (మేల్ / ఫిమేల్)  ఆప్షన్‌కు బదులుగా  కేవలం ‘టి’ అనే ఆప్షన్‌ను పొందు పర్చనుంది. 

 రిజర్వేషన్ ఫాంలో  ట్రాన్స్ జెండర్ల  కోసం టీ ఆప్షన్ ను అందుబాటులోకి  తీసుకు వస్తోంది. ఈ మేరకు  రిజర్వేషన్ ఫాంలో  సవరణలు చేయాలని అక్టోబరు 17న జోనల్ అధికారులకు ఒక లేఖలో రైల్వే బోర్డు తెలిపింది.  మేల్, ఫీమేల్.. ఆప్షన్లతో పాటుగా ట్రాన్స్ జెండర్ (టి) ఆప్షన్ చేర్చాలని  రైల్వే బోర్డు నిర్ణయించింది.  దీనికి సాఫ్ట్వేర్ లో  కూడా మార్పులు తేవాలని  సూచించింది.  అలాగే టికెట్ బుకింగ్ తో పాటు.. కాన్సిల్  చేసుకునే ఫాంలో  కూడా ట్రాన్స్ జెండర్ ఆప్షన్ చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది.  ట్రాన్స్‌జెండర్‌ హక్కుల చట్టం 2016పై   పార్లమెంటరీ  స్టాండింగ్‌ కమిటీ సిఫారసులపై విమర్శలు వెల్లువెత్తడంతో  2014లో  సుప్రీంకోర్టు ఇచ్చిన  ఆదేశాల మేరకు ఈ మార్పులు చేస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top