భారత్‌కు నూబియా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లు.. | nubia Launches Its First Borderless Flagship Smartphone nubia Z9 | Sakshi
Sakshi News home page

భారత్‌కు నూబియా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లు..

May 14 2015 12:57 AM | Updated on Sep 3 2017 1:58 AM

భారత్‌కు నూబియా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లు..

భారత్‌కు నూబియా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లు..

మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న చైనాకు చెందిన జడ్‌టీఈ అనుబంధ కంపెనీ నూబియా బ్రాండ్ భారత్‌లో అడుగుపెడుతోంది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న చైనాకు చెందిన జడ్‌టీఈ అనుబంధ కంపెనీ నూబియా బ్రాండ్ భారత్‌లో అడుగుపెడుతోంది. ఆన్‌లైన్ ద్వారా మొబైల్ ఫోన్లను విక్రయించేందుకు నూబియా రెడీ అయింది. ముందుగా జడ్9 మిని స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. 5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ 1,080/1,920 పిక్సెల్ రిసొల్యూషన్ డిస్‌ప్లే, ఆన్‌డ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్, 4జీ, అక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీ, 16 మెగాపిక్సెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,900 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి.

ధర రూ.15 వేలుండొచ్చు. ఇక ఇప్పటికే జడ్‌టీఈ పలు మోడళ్లను భారత్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. నూబియా స్మార్ట్‌ఫోన్ల ధర రూ.7,500ల నుంచి ప్రారంభం. నూబియా ఎక్స్6 మోడల్ ధర అత్యధికంగా రూ.50 వేలుంది. భారత మార్కెట్ కోసం నూబియా.ఇన్ వెబ్‌సైట్‌తోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ కంపెనీ ఖాతాలు తెరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement