పీఎఫ్‌ జమ ఆలస్యం అయితే పెనాల్టీ ఉండదు...

No penalty on employers for delay in Provident Fund - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ రోజుల్లో కంపెనీలు తమ ఉద్యోగుల తరఫున భవిష్యనిధి(పీఎఫ్‌) చందాలను జమ చేయడంలో జాప్యం జరిగితే, ఎటువంటి పెనాల్టీలు వసూలు చేయరాదని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించినట్టు సెంట్రల్‌ ప్రావిడెండ్‌ కమిషనర్‌ సునీల్‌ బర్త్‌వాల్‌ ఓ వెబినార్‌ సందర్భంగా తెలిపారు.. మార్చి 25 నుంచి కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయడంతో కంపెనీలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు నగదు పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయానికొచ్చింది. ఈపీఎఫ్‌ పథకం 1952 కింద కంపెనీలు పీఎఫ్‌ జమలను సకాలంలో చేయకపోతే నష్ట చార్జీ లేదా పెనాల్టీని విధించొచ్చు. గడిచిన నెలకు సంబంధించిన పీఎఫ్‌ను తర్వాతి నెల 15వ తేదీ వరకు జమ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత కూడా10 రోజుల గడువుంటుంది. తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా 6.5 లక్షల సంస్థలకు ఉపశమనం కల్పించనుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top