ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌కు  షరతులతో కూడిన ఆమోదం

NCLAT allows implementation of Arcelor Mittal resolution plan for Essar Steel - Sakshi

ఎన్‌సీఎల్‌టీ రూలింగ్‌ తదుపరి విచారణ ఈ నెల 27న

న్యూఢిల్లీ: ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌కు ఆర్సెలర్‌ మిట్టల్‌ కంపెనీకి ఎన్‌సీఎల్‌టీ షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. దీంతో  స్వదేశంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న బిలియనీర్‌ లక్ష్మీ మిట్టల్‌ చిరకాల స్వప్నం సాకారం కానున్నది. దివాళా ప్రక్రియను ఎదుర్కొంటున్న ఎస్సార్‌ స్టీల్‌ టేకోవర్‌ కోసం ఆర్సెలర్‌ మిట్టల్, నిప్పన్‌ స్టీల్‌ అండ్‌ సుమిటొమో మెటల్‌ కార్ప్‌లు రూ.42,000 కోట్ల ఆఫర్‌ను ఇచ్చాయి.

ఎస్సార్‌ స్టీల్‌ ప్రమోటర్ల అప్పీల్‌ నేపథ్యంలో తుది ఉత్తర్వులకు లోబడి ఆర్సెలర్, నిప్పన్‌ల రిజల్యూషన్‌ ప్లాన్‌కు ఆమోదం ఆధారపడి ఉంటుందని ఇద్దరు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27న జరగనున్నది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top