నిర్వహణతోనే..

Management is important in Gated Community - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గేటెడ్‌ కమ్యూనిటీల్లో పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్‌ పూల్, జిమ్‌ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యముండాలి. అప్పుడే ఇంటి విలువ రెట్టింపవుతుంది. అందుకే సొసైటీ మెంబర్లు సక్రమంగా ఉండాలి. ప్రతి పైసా ఖర్చు లెక్కుండాలి. ప్రతి ఫ్లాట్‌ యజమానులతో స్నేహపూర్వకంగా మెలగాలి.

విద్యుత్, డ్రైనేజీ, మంచినీరు, లిఫ్టు వంటి మౌలిక వసతుల నిర్వహణకు ప్రత్యేకంగా ఉద్యోగులుండాలి. అప్పుడే ఆ గృహ సము దాయం బాగుంటుంది. రిపేర్ల విషయంలో నాణ్యమైన వస్తువులనే వినియోగించాలి. ఇంటి విలువ అనేది కేవలం ఫ్లాట్‌కో.. ప్లాట్‌కో పరిమితం కాదు.. అందులోని సౌకర్యాలు, నిర్వహణతో కలిపుంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈమధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్‌ కీపింగ్‌ వంటి వసతులూ ఉంటేనే ధర ఎక్కువ పలుకుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి.

ప్రాంతం కూడా ముఖ్యమే..
మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేమనుకోండి. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉంటుందనేది మర్చిపోవద్దు.

అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాళ్లు ఉండాలన్నమాట. అలాగే ఆ ఇంటికొచ్చేం దుకు లిఫ్ట్, పార్కింగ్‌ వంటి వసతులతో పాటుగా అడ్రస్‌ సులువుగా అర్థమయ్యేలా ల్యాండ్‌మార్క్, ఇంటి నుంచి మెయిన్‌ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top