చల్లా రాజేంద్ర ప్రసాద్‌కు లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డ్‌ | Lifetime Achievement Award for Challa Rajendra Prasad | Sakshi
Sakshi News home page

చల్లా రాజేంద్ర ప్రసాద్‌కు లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డ్‌

Oct 19 2019 5:11 AM | Updated on Oct 19 2019 5:11 AM

Lifetime Achievement Award for Challa Rajendra Prasad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఇన్‌స్టాంట్‌ కాఫీ దిగ్గజం సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ చల్లా రాజేంద్ర ప్రసాద్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఇన్‌స్టాంట్‌ కాఫీ రంగంలో ఆయన చేసిన కృషికిగాను ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టాంట్‌ కాఫీ ఆర్గనైజేషన్‌ నుంచి లైఫ్‌ టైం అచీవ్‌మెంట్‌ అవార్డు వరించింది. ఇటీవల జర్మనీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును స్వీకరించారు. 1,500 టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్రారంభమైన సీసీఎల్‌ ప్రస్థానం నేడు 35,000 టన్నుల స్థాయికి చేరింది. 90కి పైగా దేశాల్లోని క్లయింట్లకు కంపెనీ కాఫీ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement