మార్కెట్లోకి కేటీఎమ్‌ ‘ఆర్‌సీ 125 ఏబీఎస్‌’

KTM RC 125 ABS Launch in Market - Sakshi

 ప్రారంభ ధర రూ.1.47 లక్షలు

న్యూఢిల్లీ: ఆస్ట్రియా దేశానికి చెందిన స్పోర్ట్స్‌ బైక్స్‌ తయారీ సంస్థ కేటీఎమ్‌.. ‘ఆర్‌సీ 125 ఏబీఎస్‌’ పేరుతో అధునాతన బైక్‌ను బుధవారం ఇక్కడి మార్కెట్లోకి విడుదల చేసింది. 124.7 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌ ప్రారంభ ధర రూ.1.47 లక్షలుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 470 కేటీఎమ్‌ ఎక్స్‌క్లూజివ్‌ షోరూమ్‌లలో బుధవారం నుంచి బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని, నెలాఖరు నుంచి డెలివరీలు చేస్తామని వెల్లడించింది. పనితీరు పరంగా కేటీఎమ్‌ బైక్‌లు ఉత్తమ ప్రదర్శన చూపుతున్నట్లు ఈ సంస్థకు భారత భాగస్వామి అయిన బజాజ్‌ ఆటో పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top