రూ.967కే జెట్‌ ఎయిర్‌వేస్‌ టికెట్‌!

Jet Airways offers fares starting Rs 967  - Sakshi

ఉడాన్‌ స్కీమ్‌లో భాగంగా ఆఫర్‌

జూన్‌ 14 నుంచి సేవలు...

ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ ‘జెట్‌ ఎయిర్‌వేస్‌’ తాజాగా తన ఉడాన్‌ ఫ్లైట్స్‌ టికెట్‌ ధరలను రూ.967 నుంచి ఆఫర్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్‌ 14 నుంచి ఉడాన్‌ విమాన సర్వీసులను ప్రారంభిస్తామని తెలియజేసింది. తొలి విమానాన్ని లక్నో– అలహాబాద్‌– పాట్నా రూట్‌లో నడుపుతారు.

జనవరిలో జరిగిన ఉడాన్‌ రెండో విడత బిడ్డింగ్‌లో జెట్‌ ఎయిర్‌వేస్‌ నాలుగు రూట్లకు లైసెన్స్‌ దక్కించుకోవటం తెలిసిందే. లక్నో– అలహాబాద్‌– పాట్నా రూట్‌తోపాటు న్యూఢిల్లీ–నాసిక్, నాగ్‌పూర్‌–అలహాబాద్‌–ఇండోర్, లక్నో–బరేలీ–ఢిల్లీ రూట్లలోనూ ఫ్లైట్స్‌ను నడుపుతామని కంపెనీ పేర్కొంది.

ఉడాన్‌ స్కీమ్‌ కింద లక్నో–అలహాబాద్‌–పాట్నా ఫ్లైట్‌ టికెట్‌ ధర రూ.967గా, పాట్నా–అలహాబాద్‌–పాట్నా రూట్‌ టికెట్‌ ధర రూ.1,216గా ఉంటుంది. నాగ్‌పూర్‌–అలహాబాద్‌–నాగ్‌పూర్‌ రూట్‌ టికెట్‌ ధర రూ.1,690గా, ఇండోర్‌–అలహాబాద్‌–ఇండోర్‌ ధర రూ.1,914గా ఉంటుంది. ఇక ఢిల్లీ–నాసిక్‌–ఢిల్లీ ఫ్లైట్‌ టికెట్‌ ధర రూ.2,665గా ఉంటుంది. ఉడాన్‌ స్కీమ్‌ కింద గంట  ప్రయాణానికి రూ.2,500లోపు  మాత్రమే వసూలు చేయాల్సి ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top