కరోనా కవచ్‌... బీమా కంపెనీల కొత్త పాలసీలు

IRDAI releases guidelines for Corona Kavach - Sakshi

కరోనా కారణంగా ఆస్పత్రి పాలైతే ఖర్చులను చెల్లించే హెల్త్‌ పాలసీలను ‘కరోనా కవచ్‌’ పేరుతో బీమా సంస్థలు తీసుకొచ్చాయి. కరోనా వైరస్‌ నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక స్వల్పకాలిక పాలసీలను (గరిష్టంగా 11 నెలల కాలంతో) జూలై 10 నాటికి తీసుకురావాలంటూ బీమా నియంత్రణ సంస్థ..  ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అ«థారిటీ ఆఫ్‌ ఇండియా  (ఐఆర్‌డీఏఐ )గడువు పెట్టడంతో.. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్, మ్యాక్స్‌బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్‌ తదితర బీమా సంస్థలు ఇటువంటి పాలసీలను ప్రవేశపెట్టాయి.  

మ్యాక్స్‌బూపా
మ్యాక్స్‌ బూపా సంస్థ తక్కువ ప్రీమియానికే కరోనా కవచ్‌ పాలసీని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. రూ.2.5 లక్షల కవరేజీ కోసం 31–55 ఏళ్ల వయసు వారు రూ.2,200 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని.. అదే ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి కోసం రూ.2.5 లక్షల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం రూ.4,700గా ఉంటుందని తెలిపింది.  

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో
కరోనా కారణంగా వ్యక్తులు ఆస్పత్రిలో చేరి చికిత్సలు తీసుకుంటే పరిహారం చెల్లించే సదుపాయంతో హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో సంస్థ కరోనా కవచ్‌ పాలసీని విడుదల చేసింది. ప్రభుత్వ గుర్తింపు ఉన్న వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో చేసిన పరీక్షతో పాజిటివ్‌ వచ్చి చికిత్స తీసుకుంటే అందుకయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. అంతేకాదు కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు ఇచ్చే కోమార్బిడిటీ చికిత్సలకు కూడా ఈ పరిహారం అందుతుంది. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలను కోమార్బిడిటీగా చెబుతారు. అంబులెన్స్‌ చార్జీలను కూడా చెల్లిస్తుంది. కరోనా పాజిటివ్‌ వచ్చి ఇంట్లోనే ఉండి చికిత్సలు తీసుకున్నా కానీ, 14 రోజుల కాలానికి అయ్యే ఖర్చులను భరిస్తుండడం ఈ పాలసీలోని అనుకూలాంశం. అల్లోపతితోపాటు ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ వైద్యాలకు కవరేజీ కూడా ఇందులో ఉంటుంది. రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు కవరేజీని ఎంచుకోవచ్చు.  

బజాజ్‌ అలియాంజ్‌
బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ కూడా ఇదే విధమైన పాలసీని ప్రవేశపెట్టింది. కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.5 లక్షల కవరేజీకి ప్రీమియం రూ.447–5,630 మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీనికి జీఎస్టీ చార్జీలు అదనం. హాస్పిటల్‌ డైలీ క్యాష్‌ బెనిఫిట్‌ ఎంచుకుంటే ప్రీమియం రూ.3,620 మధ్య ఉంటుంది. 0–35 ఏళ్ల మధ్యనున్న వారు మూడున్నర నెలలకు రూ.50వేల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం కింద రూ.447తోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

11-08-2020
Aug 11, 2020, 06:11 IST
లండన్‌: కోవిడ్‌ –19 సీజనల్‌గా వచ్చిపోయే వైరస్‌లాగా కనిపించడం లేదని, అందుకే దీన్ని కట్టడిచేయడం కష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య...
11-08-2020
Aug 11, 2020, 05:59 IST
న్యూఢిల్లీ: భారత్‌లో వరుసగా నాలుగో రోజూ 60 వేలకు పైగా కేసులు వెలుగుచూశాయి. సోమవారం కొత్తగా 62,064 కేసులు బయట...
11-08-2020
Aug 11, 2020, 05:54 IST
సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. సోమవారం నాటికి 25 లక్షల పరీక్షలు...
11-08-2020
Aug 11, 2020, 05:51 IST
జెనీవా: కరోనా వైరస్‌ కోరల్లో చిక్కుకొని ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు విలవిల్లాడుతు న్నారు.  కడుపు నింపుకునే మార్గం లేక పలక బలపం...
11-08-2020
Aug 11, 2020, 05:49 IST
సాక్షి, అమరావతి: వచ్చే నెల రెండో వారం నాటికి ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని ఎపిడెమాలజిస్ట్‌లు(అంటువ్యాధుల నిపుణులు) చెబుతున్నారు....
11-08-2020
Aug 11, 2020, 01:25 IST
అటో పరిశ్రమను కరోనా సంక్షోభం వెంటాడుతూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జూలైలో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు...
11-08-2020
Aug 11, 2020, 00:29 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19, లాక్‌డౌన్‌ అడ్డంకులు ఉన్నప్పటికీ భారత్‌ నుంచి ఔషధ ఎగుమతులు ఏప్రిల్‌–జూన్‌లో వృద్ధి చెందాయి. ఫార్మాస్యూటికల్స్‌...
11-08-2020
Aug 11, 2020, 00:09 IST
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కరోనా వైరస్‌ మహమ్మారి, లాక్‌డౌన్‌ అంశాలు జీవిత బీమా రంగంపైనా ప్రతికూల ప్రభావాలు చూపించాయి. అయితే,...
10-08-2020
Aug 10, 2020, 20:29 IST
సాక్షి, హైద‌రాబాద్‌: ఆగ‌స్టు 15న జ‌రగ‌నున్న‌ స‌్వాతంత్ర్య దినోత్స‌వ సంబ‌రాల‌పై హైకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ,...
10-08-2020
Aug 10, 2020, 19:17 IST
ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 46,699 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 7,665 మందికి పాజిటివ్‌గా తేలింది.
10-08-2020
Aug 10, 2020, 18:44 IST
వెల్లింగ్టన్‌: కరోనాను క‌ట్ట‌డి చేసిన ప్రాంతం, వైర‌స్ వ్యాప్తిని నిర్మూలించిన దేశంగా న్యూజిలాండ్ చ‌రిత్ర‌కెక్కింది. అక్క‌డ 100 రోజులుగా ఒక్క...
10-08-2020
Aug 10, 2020, 17:26 IST
భోపాల్‌ : కరోనా నుంచి కోలుకున్న అనంతరం ప్లాస్మా దానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌. కోవిడ్‌‌-19...
10-08-2020
Aug 10, 2020, 16:10 IST
వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తోంది....
10-08-2020
Aug 10, 2020, 13:33 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. తాజాగా మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ దిగ్గజం ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ బారిన పడ్డారు....
10-08-2020
Aug 10, 2020, 12:13 IST
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 2 కోట్లకు...
10-08-2020
Aug 10, 2020, 11:48 IST
జనగామ: కరోనా మహమ్మారి ప్రజలను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది. వైరస్‌ బారినపడి శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చాలామంది ఆర్థిక...
10-08-2020
Aug 10, 2020, 10:12 IST
వరుసగా నాలుగో రోజూ 62 వేలకు పైగా కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి.
10-08-2020
Aug 10, 2020, 10:07 IST
సాక్షి, యాదాద్రి : కరోనా బాధితులకు జిల్లా స్థాయిలోనే వైద్యం అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా స్థానిక పరిస్థితులు...
10-08-2020
Aug 10, 2020, 09:22 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సోమవారం వైద్యారోగ్యశాఖ...
10-08-2020
Aug 10, 2020, 08:48 IST
సాక్షి, సిటీబ్యూరో: కరోనా బాధితుల ప్రాణాలు నిలిపేందుకు సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) సంయుక్తంగా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top