సొంతింటి రాజసం!

Indrasena reddy with sakshi reality - Sakshi

‘‘యద్భావం.. తద్భవతి’’ అన్నది ఉపనిషత్తు. ‘నీ ఆలోచనలే నీవు’ అని దానర్థం. అంటే సానుకూల ఆలోచనలు, ఆచరణ మీదే మనిషి ఎదుగుదల ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే గొప్ప వ్యక్తులు, మహనీయుల జీవిత చరిత్ర, సూక్తులను అనుసరిస్తుంటాం. స్ఫూర్తిని పొందుతుంటాం! మరి, అనునిత్యం గొప్పవాళ్ల అడుగుజాడలను ఫాలో కావాలంటే? మన చుట్టూ ఉండే వాతావరణం ప్రేరేపితంగా ఉండాలి. అంటే ఇల్లన్నమాట. దీనర్థం ఇంటి నిర్మాణంలోనే రాజసం ఉట్టిపడాలి. గతంలో ప్యాలెస్‌లు, ప్రీమియం రెస్టారెంట్లకు మాత్రమే పరిమితమైన సబ్లిమినల్‌ ఆర్కిటెక్చర్స్‌ తాజాగా నివాస సముదాయాలకూ విస్తరించాయి.  

సాక్షి, హైదరాబాద్‌ :  మానసిక చైతన్యాన్ని, ప్రేరణను కలిగించడం, అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని వెలికి తీయడం సబ్లిమినల్‌ ఆర్కిటెక్చర్‌ ప్రత్యేకత. ఈ తరహా నిర్మాణాలు ఉన్నత స్థానానికి చేరుకోవాలనే కోరికను, ప్రోత్సాహాన్ని, ప్రేరణను కలిగిస్తాయన్నమాట. ఇందుకోసం ప్రాజెక్ట్‌లల్లో మహనీయులు, గొప్ప నాయకుల చిత్ర పటాలు, జీవిత చరిత్రలు, బొమ్మ లు, గుర్తులను పెడతారు.

అనునిత్యం ఆయా వ్యక్తుల అడుగుజాడలు కళ్లముందు కదలాడుతుంటూ మన మెదడు పాజిటివ్‌ ఆలోచనలు చేస్తుంది. దీంతో మాటల్లో, చేతల్లోనూ ఉన్నతమైన భావాలు బహిర్గతమవుతాయి. మొత్తంగా మనిషి ఆరోగ్యకరమైన ఉన్నతికి తొలి అడుగుపడేది సొంతింటి నుంచే!

సొంతిల్లే ప్రేరణ..
మనిషి ఎదుగుదలకు చుట్టూ ఉండే వాతావరణం, నివాస పరిసరాలు, భావోద్వేగాలకు సంబంధం ఉం టుందని విశ్లేష కుల మాట. ఉదాహరణకు మనం ఆసుపత్రికి వెళ్లినప్పుడు దయా గుణంతో, గుడికి వెళ్లినప్పుడు భక్తి భావంతో ఉంటాం. అదే ప్యాలెస్‌కు వెళ్లినప్పుడు రాజసంగా ఉంటాం. ఎందుకంటే? ప్యాలెస్‌లో మనం ఎటు చూసిన రాజుల చిత్ర పటాలు, జీవిత ^è రిత్రలు, గుర్తులు కనిపిస్తుంటాయి గనక! ప్యాలెస్‌ తరహా వాతావరణాన్ని నివాస సముదాయాల్లోనూ కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి హైదరాబాద్‌ నిర్మాణ సంస్థలు.  

కామన్‌ ఏరియాల వినియోగం..
సబ్లిమినల్‌ ఆర్కిటెక్చర్‌లో ఇంట్లో కాకుండా ప్రాజెక్ట్‌ కామన్‌ ఏరియా, ఓపెన్‌ స్పేస్, క్లబ్‌హౌజ్‌ వంటి ప్రాంతాల్లో స్ఫూర్తిదాయక వ్యక్తులు, మహనీయుల బొమ్మలు, జీవిత చరిత్రలు, గుర్తులుంటాయని అప్పా జంక్షన్‌కు చెందిన ఓ డెవలపర్‌ తెలిపారు. ఉదాహరణకు అప్పా జంక్షన్‌లో బ్లిమినల్‌ ఆర్కిటెక్చర్‌ ప్రాజెక్ట్‌ రాజక్షేత్రలో ఫోర్బ్స్‌ వంటి అంతర్జాతీయ మేగజైన్‌లో ప్రచురితమైన గొప్ప వ్యక్తుల కవర్‌ పేజీలను ఒకదగ్గర ఉంచుతాం. మధ్యలో అద్దాన్ని పెడతాం.అద్దంలో కవర్‌పేజీను పోల్చుకుంటూ మనమూ ఫోర్బ్స్‌ మేగజైన్‌ను చేరాలనే ప్రేరణ కలుగుతుందని’’ వివరించారు.

సంపదకు, భౌగోళికతకు మధ్య సంబంధం ఉంటుందని విశ్లేషకుల మాట. ఉదాహరణకు ప్రపంచ బిలియనీర్లలో చాలా మంది మన్‌హటన్, న్యూయార్క్, సిలికాన్‌వ్యాలీలో ఉంటారు. మన దేశంలో అయితే ముంబైలో.. తెలుగు రాష్ట్రాల్లో అయితే బంజారాహిల్స్‌ లేదా జూబ్లిహిల్స్‌లోనే ఉంటారు. కారణం మనిషి ఉన్నతికి అదొక చిరునామా. పైగా మరింత ఎదుగుదలకు మార్గదర్శి కూడా అదే. రోజూ తిరిగే పరిసరాలు, మాట్లాడే వ్యక్తులు ఉన్నతంగా ఉంటే మనలోనూ ఉన్నతమైన భావాలు, ఆలోచనలు కలుగుతాయి.
 

అప్పా జంక్షన్‌లో రాజక్షేత్ర...
అప్పా జంక్షన్‌లో 1.8 ఎకరాల్లో రాజక్షేత్ర పేరిట సబ్లిమినల్‌ ఆర్కిటెక్చర్‌ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టామని గిరిధారి హోమ్స్‌ ఎండీ ఇంద్రసేనా రెడ్డి ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. మొత్తం 120 ఫ్లాట్లు. 1,180 నుంచి 1,850 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి.

ప్రారంభ ధర రూ.60 లక్షలు. రాజక్షేత్రలో మహనీయులు చిత్ర పటాలు, గుర్రం, ఏనుగు, రథం వంటి చిత్రాలను గోడల మీద (మ్యూరల్‌ ఆర్ట్‌) చిత్రీకరిస్తాం. నివాసితులకు ప్యాలెస్‌ తరహా వాతావరణాన్ని కలిగించేందుకు ఫాల్స్‌ సీలింగ్‌ను కంపెనీయే చేపడుతుంది. 7 వేల చ.అ.ల్లో క్లబ్‌హౌజ్‌తో పాటూ గ్రాండ్‌ ప్రివ్యూ థియేటర్, స్విమ్మింగ్‌ పూల్, జిమ్‌ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top