స్వదేశీ అబ్బాయి.. విదేశీ అమ్మాయి

The bride and groom are united in Hindu tradition - Sakshi

హిందూ సంప్రదాయంలో ఒక్కటైన వధూవరులు 

తెనాలి: ఆస్ట్రేలియా అమ్మాయి..తెనాలి అబ్బాయి ప్రేమించుకుని హిందూ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నా­రు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. కొల్లిపరకు చెందిన ఇంద్రసేనారెడ్డి ఎంఎస్‌ చేయడానికి ఆ్రస్టేలియా వెళ్లారు.

చదువు పూర్తయ్యాక ఆ్రస్టేలియా­లోని మెల్‌బోర్న్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆ దేశ పౌరసత్వమూ లభించింది. తన కంపెనీలోనే పనిచేస్తో­న్న ఆ్రస్టేలియా యువతి సారా ఎలిజబెత్‌ కౌల్టర్‌ను ప్రేమించాడు. యువతి కూడా ప్రేమను అంగీకరించడంతో ఈ విష­యాన్ని ఇరువురూ వారి కుటుంబాలకు చెప్పారు.

హిందూ సంప్రదాయాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో కొల్లిపర­లో సంప్రదాయ వివాహానికి ఇంద్రసేనారెడ్డి చేసిన ప్రతిపాదనకు ఎలిజబెత్‌ సమ్మతించారు. దీంతో ఇంద్రసేనారెడ్డి తల్లిదండ్రులు కూసం శ్రీనివాసరెడ్డి, పద్మజ, బంధుమిత్రుల స­మ­క్షంలో కొల్లిపరలోని జీవీఆర్‌ కళ్యాణమండపంలో శనివా­రం వైభవంగా వివాహం జరిగింది.

కుమార్తె పెళ్లికి ఎలి­జబెత్‌ తల్లిదండ్రులు జాన్‌ కౌల్టర్, అన్నెట్టీ దంపతులు, సోదరి, సో­దరుడు, అతడి భార్య హాజరయ్యారు. హిందూ సంప్రదా­య పద్ధతిలో పురుషులు షర్టు, పట్టు పంచెలు, మహిళలు చీ­రె, జాకెట్‌ ధరించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ఈ వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top