రికార్డుస్ధాయిలో ఎఫ్‌డీఐ వెల్లువ | India Received Highest FDI In Last Financial Year | Sakshi
Sakshi News home page

రికార్డుస్ధాయిలో ఎఫ్‌డీఐ వెల్లువ

Aug 1 2019 8:28 AM | Updated on Aug 1 2019 8:32 AM

India Received Highest FDI In Last Financial Year - Sakshi

విదేశీ పెట్టుబడుల వివరాలు ఇలా..

సాక్షి, న్యూఢిల్లీ : ఎఫ్‌డీఐ విధానాన్ని సరళీకరించడంతో పాటు సంస్కరణల వేగంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి అత్యధికంగా రూ 4.5 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులు తరలివచ్చాయి. పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య శాఖ (డీపీఐటీ) నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐ రూ 4.2 లక్షల కోట్లుగా నమోదైంది.

2018-19 ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక ఎఫ్‌డీఐ భారత్‌కు తరలివచ్చిందని, గత ఐదేళ్లుగా భారత్‌ రూ 18 లక్షల కోట్ల ఎఫ్‌డీఐని ఆకర్షించిందని డీపీఐటీ 2018-19 వార్షిక నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌డీఐ పాలసీని సరళీకరించడంతో పాటు సంస్కరణలను వేగవంతం చేయడం ద్వారా దేశంలోకి పెద్ద ఎత్తున ఎఫ్‌డీఐ వెల్లువెత్తుతోందని చెబుతున్నారు. మెరుగైన వృద్ధి రేటు సాధించేందుకు, వివిధ రంగాల్లో ఉత్తేజం నింపేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉపకరిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement