నోట్ల రద్దుతో పెరిగిన పన్నుల చెల్లింపులు

Increased tax payments with cancellation of notes - Sakshi

ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యురాలు షమికా రవి

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం నిబంధనలకు అనుగుణంగా పన్నులు చెల్లించే ధోరణులు పెరిగాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) సభ్యురాలు షమికా రవి తెలిపారు. ఇన్నాళ్ల తర్వాత డీమోనిటైజేషన్‌ను తరచి చూస్తే.. దీన్ని మరికాస్త మెరుగ్గా అమలు చేసి ఉండొచ్చని అనిపించినా.. పెద్ద నోట్ల రద్దుతో పన్నులపరంగా ప్రయోజనమే చేకూరిందని ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు.

2016 నవంబర్‌ 8న ప్రధాని నరేంద్ర మోదీ రూ. 500, రూ. 1,000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాల ప్రకారం అప్పట్లో సుమారు రు. 15.41 లక్షల కోట్ల మేర విలువ చేసే పెద్ద నోట్ల చలామణీలో ఉండగా.. ప్రస్తుతం 15.31 లక్షల కోట్ల కరెన్సీ మళ్లీ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి చేరింది. పెద్ద నోట్ల రద్దుపై ఇప్పటికీ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో షమికా రవి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రూపాయి పతనాన్ని .. దేశ శక్తి, సామర్థ్యాల క్షీణతకు నిదర్శనంగా భావించరాదని ఆమె స్పష్టం చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top