ప్రీఓన్డ్ ఔట్‌లెట్ ప్రారంభించిన హోండా | Honda launched the pre-owned outlet | Sakshi
Sakshi News home page

ప్రీఓన్డ్ ఔట్‌లెట్ ప్రారంభించిన హోండా

Sep 2 2015 1:02 AM | Updated on Sep 3 2017 8:33 AM

ప్రీఓన్డ్ ఔట్‌లెట్ ప్రారంభించిన హోండా

ప్రీఓన్డ్ ఔట్‌లెట్ ప్రారంభించిన హోండా

హైదరాబాద్‌లో మార్కెట్ లీడర్‌షిప్‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ హైదరాబాద్‌లో ‘బెస్ట్ డీల్’ పేరుతో ప్రీ ఓన్డ్ ఔట్‌లెట్‌ను ప్రారంభించింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో మార్కెట్ లీడర్‌షిప్‌ను మరింత బలోపేతం చేసుకునేందుకు హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ హైదరాబాద్‌లో ‘బెస్ట్ డీల్’ పేరుతో ప్రీ ఓన్డ్ ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. పాత హోండా వాహనాన్ని ఇచ్చేసి.. ఎక్స్‌చేంజ్ పద్ధతిలో కొత్త ద్విచక్ర వాహనాన్ని (లేదా) సర్టిఫైడ్ హోండా టూవీలర్‌ను సొంతం చేసుకోవచ్చని హోండా మోటార్ సైకిల్స్ దక్షిణ  ప్రాంత సేల్స్ హెడ్ ఆశీష్ చౌదరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బైకుతో పాటు కొనుగోలుదారులకు అదనంగా 2 సర్వీసులు, 6 నెలల వారంటీని కూడా పొందవచ్చన్నారు. దేశంలో ఇలాంటి ప్రీ-ఓన్డ్ ఔట్‌లెట్‌లలో ఇది 79వ ది కాగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొదటిదని పేర్కొన్నారు.

Advertisement
Advertisement