జీఎస్‌టీ వార్షిక రిటర్నుల గడువు తేదీ పొడిగింపు | GST Extend Annual return deadline | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీ వార్షిక రిటర్నుల గడువు తేదీ పొడిగింపు

Nov 15 2019 11:06 AM | Updated on Nov 15 2019 11:06 AM

GST Extend Annual return deadline - Sakshi

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను పరిధిలోని ట్యాక్స్‌ పేయర్లకు ఊరట లభించింది. జీఎస్‌టీ వార్షిక రిటర్న్స్‌ (జీఎస్‌టీఆర్‌–9) దాఖలు చేయడానికి గడువు తేదీలను కేంద్రం పొడిగించింది. 2017–18 రిటర్నులను దాఖలు చేయడానికి ఈ ఏడాది డిసెంబర్‌ 31 గడువు తేదీ కాగా, 2018–19 రిటర్నుల చివరి తేదీ వచ్చే ఏడాది మార్చి 31గా ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా సమన్వయ నివేదిక (రికన్సిలియేషన్‌ స్టేట్‌మెంట్‌) దాఖలు తేదీల్లో కూడా మార్పులు చేసింది. మరోవైపు, జీఎస్‌టీ ఫామ్‌లను మరింత సులభతరం చేస్తున్నట్లు కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ మండలి (సీబీఐసీ) ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement