గోఎయిర్‌ తగ్గింపు ధరలు : భారీ డీల్స్‌

GoAir puts 1 mn seats up for sale at Rs 1,099 starting fares   - Sakshi

సాక్షి, ముంబై:  బడ్జెట్‌ క్యారియర్‌ గోఎయిర్  విమానయాన సంస్థ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.  ఫెస్టివల్ సీజన్స్  సేల్‌ పథకంలో దేశీయ విమాన టికెట్లపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది.  తన నెట్‌వర్గ్‌ అంతటా  దాదాపు లక్షటికెట్లను  ఈ తగ్గింపు ధర ఆఫర్‌లో విక్రయించాలని ప్లాన్‌ చేసింది.  1099 (అన్నీ కలిసిన)  రూపాయల ప్రారంభ ధర వద్ద వన్‌వే  విమాన టికెట్లను అందిస్తున్నట్టు తెలిపింది.  ఈ ఆఫర్‌లో టికెట్‌ బుకింగ్‌  నేటి(ఆగస్టు 4,శనివారం) నుంచి మొదలైన ఆగస్టు 9వ తేదీవరకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఇలా బుక్‌ చేసుకున్న టికెట్ల ద్వారా ఆగస్టు 4 నుంచి డిసెంబరు 31, 2018 దాకా ప్రయాణించవచ్చని కంపెనీ  వెల్లడించింది. 

దీంతోపాటు కొన్ని  ఇతర అదనపు  ప్రయోజనాలను  కూడా ఆఫర్‌ చేస్తోంది.  గో ఎయిర్‌ వెబ్‌సైట్‌  లేదా మొబైల్  యాప్‌ద్వారా బుక్ చేసినట్లయితే వినియోగదారులకు  3 వేల రూపాయల వరకు ప్రత్యేకమైన  డిస్కౌంట్‌. ఇంకా పేటీఎం వాలెట్‌ ద్వారా చెల్లింపులు చేస్తే కనిష్టంగా 5శాతం  లేదా 250  రూపాయలు, గరిష్టంగా 20శాతం  లేదా 1,100  రూపాయల రాయితీ ఇస్తామని తెలిపింది.

కాగా  గోఎయిర్ దేశీయంగా అహ్మదాబాద్, బాగ్డోదర,బెంగళూరు, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గోవా, గువహతి, జైపూర్, జమ్మూ, కొచ్చి, కోల్‌కతా, లెహ్, లక్నో, ముంబై, నాగ్‌పూర్‌, పాట్నా, పోర్ట్ బ్లెయిర్, పూణే, రాంచీ, శ్రీనగర్, హైదరాబాద్ 23 మార్గాల్లో వారానికి 1544  విమాన సర్వీసులను అందిస్తోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top