టెస్లా కారును సొంతం చేసుకున్న ఫోర్డ్ | Ford Motor pays 1,99,950 to find Tesla's X-factor | Sakshi
Sakshi News home page

టెస్లా కారును సొంతం చేసుకున్న ఫోర్డ్

Apr 21 2016 2:38 PM | Updated on Oct 4 2018 4:56 PM

టెస్లా కారును సొంతం చేసుకున్న ఫోర్డ్ - Sakshi

టెస్లా కారును సొంతం చేసుకున్న ఫోర్డ్

టెస్లా మోటార్స్ ఇంక్ తయారు చేసిన మొదటి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల్లో ఒకటైన మోడల్-ఎక్స్ ఫ్యాక్టర్ కు ఫోర్డ్ మోటారు దాదాపు కోటి 32 లక్షలకు సొంతం చేసుకుంది.

టెస్లా మోటార్స్ ఇంక్ తయారు చేసిన మొదటి స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల్లో ఒకటైన మోడల్-ఎక్స్ ఫ్యాక్టర్ కు ఫోర్డ్ మోటారు దాదాపు కోటి 32 లక్షలకు సొంతం చేసుకుంది. స్ట్రికర్ ధర కంటే 55 డాలర్లు అధికంగా 1,99,950 డాలర్లకు(దాదాపు కోటి 32లక్షలకు పైగా) మోడల్ ఎక్స్ ను కొనుగోలు చేసింది. వెహికిల్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ప్రకారం ఈ విషయాన్ని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. టెస్లా ఫ్యాక్టరీ, కాలిఫోర్నియాలో తయారు చేసిన వాహనాల్లో ఇది 64వ కారు. రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం ఫోర్డ్ ఈ కారును మార్చి 1న కొనుగోలు చేసింది.

ఆటోమేకర్లు తమ పోటీదారులు తయారుచేసిన వాహనాలను రోడ్ టెస్టింగ్ లకు, కాంపోనెంట్స్, మెటిరీయల్స్ ఎలా అమర్చారో తెలుసుకోవడం కోసం కొనుగోలు చేస్తుంటాయి. అయితే ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపవు. మొదటిసారి ఫోర్డ్ మోటార్ ఇంత మొత్తంలో మోడల్ ఎక్స్ కు చెల్లించింది. ఆటోమేకర్లు ఎక్కువగా అధిక లాభాలనిస్తూ, ఎక్కువ ఫ్యూయల్ కెపాసిటీ కలిగి ఉన్న ఎస్ యూవీల వైపు మొగ్గు చూపుతున్నారని ఆటో మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

విద్యుద్దీకరణ కార్ల కోసం ఫోర్డ్ ఇప్పటికే 4.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతోంది. 2020 కల్లా 13 విద్యుత్ కార్లను మార్కెట్లోకి తేవాలనుకుంటున్నట్టు సమాచారం. దీంతో మార్కెట్లోకి మరిన్ని విద్యుత్ కార్లు రానున్నాయి. తమ స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్స్ ను ఎక్కువగా మార్కెట్లోకి తేవడం కోసం ఫోర్డ్ మార్కెట్లోకి వచ్చే అన్నీ కార్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement