ఆస్పైర్, ఫిగో ధరలను తగ్గించిన ఫోర్డ్ | Ford cuts Aspire and Figo prices up to Rs 91,000 | Sakshi
Sakshi News home page

ఆస్పైర్, ఫిగో ధరలను తగ్గించిన ఫోర్డ్

Aug 10 2016 1:29 AM | Updated on Sep 4 2017 8:34 AM

ఆస్పైర్, ఫిగో ధరలను తగ్గించిన ఫోర్డ్

ఆస్పైర్, ఫిగో ధరలను తగ్గించిన ఫోర్డ్

కార్ల తయారీ కంపెనీ ‘ఫోర్డ్ ఇండియా’ తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘ఆస్పైర్’, హ్యాచ్‌బ్యాక్ ‘ఫిగో’ కార్ల ధరలను రూ.91,000 వరకూ తగ్గించింది.

న్యూఢిల్లీ : కార్ల తయారీ కంపెనీ ‘ఫోర్డ్ ఇండియా’ తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘ఆస్పైర్’, హ్యాచ్‌బ్యాక్ ‘ఫిగో’ కార్ల ధరలను రూ.91,000 వరకూ తగ్గించింది. ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. విక్రయాలను పెంచటమే లక్ష్యంగా కంపెనీ ఈ తగ్గింపు చేపట్టినట్లు ప్రకటించింది. సవరించిన ధరల ప్రకారం.. 1.2 లీటర్ పెట్రోల్ ఆప్షన్ వేరియంట్ ఆస్పైర్ కారు ధర రూ.5.28 లక్షలు-రూ.6.8 లక్షల శ్రేణిలో ఉంది.

ఇక డీజిల్ ఆప్షన్ వేరియంట్ ధర రూ.6.37 లక్షలు-రూ.7.89 లక్షల శ్రేణిలో ఉంది. కాగా కంపెనీ మొత్తంగా ఆస్పైర్ మోడల్ వేరియంట్ల ధరలను రూ.25,000 నుంచి రూ.91,000 మధ్యలో తగ్గించింది. ఇప్పుడు ఫిగో 1.2 లీటర్ పెట్రోల్ ఆప్షన్ వేరియంట్ రూ.4.54 లక్షల నుంచి రూ.6.29 లక్షల మధ్యలో లభిస్తోంది. ఇక 1.5 లీటర్ డీజిల్ ఆప్షన్ వేరియంట్ ధర రూ.5.63 లక్షలు-రూ.7.18 లక్షల శ్రేణిలో ఉంది. కంపెనీ మొత్తంగా ఫిగో మోడల్ వేరియంట్ల ధరలను రూ.29,000 నుంచి రూ.50,000 మధ్యలో తగ్గించింది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement