ఆశలు గల్లంతు : ఉద్యోగులకు తీవ్ర నిరాశ

FM proposes to maintain status quo on tax slabs - Sakshi

ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితులు యథావిధి

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌పై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వేతన జీవులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితులను ఎలాంటి మార్పులు చేయకుండా యథావిధిగా ఉంచారు. ప్రయాణ, వైద్య ఖర్చులకు మాత్రమే రూ.40వేల వరకు పన్ను రాయితీని(స్టాండర్డ్‌ డిడక్షన్‌ను) ఇవంవరెన్నట్టు తెలిపారు. ఇదీ కూడా వ్యక్తిగత వ్యాపారస్తుల కంటే ఎక్కువగా పన్నులు చెల్లిస్తున్న వారికేనని చెప్పారు. సీనియర్‌ సిటిజన్లకు వైద్య ఖర్చులకు అదనపు రాయితీ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయంతో 2.5 కోట్ల వేతన ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ది చేకూరనుందని పేర్కొన్నారు. రూ.250 కోట్ల రెవెన్యూ ఉన్న కంపెనీలకు కార్పొరేట్‌ పన్నుని 25 శాతం తగ్గించారు.

కాగ, వ్యక్తిగత పన్ను మినహాయింపుల పరిమితులను ఈ బడ్జెట్‌లో పెంచబోతున్నారని, దీంతో తమకు ఎంతో మేలు చేకూరనుందని శాలరీ క్లాస్‌ ప్రజలు ఎక్కువగా ఆశించారు. కానీ పన్ను మినహాయింపుల పరిమితుల జోలికి పోకుండా.. వీటిని యథావిధిగా ఉంచడంపై జైట్లీ బడ్జెట్‌పై వేతన జీవులు తీవ్ర నిరాశవ్యక్తం చేశారు. ఆదాయపు పన్ను పరిధిలోకి కొత్తగా 5 లక్షల మంది చేరినట్టు చెప్పారు. అదనంగా రూ.90వేల కోట్ల ఆదాయ పన్ను వసూలైనట్టు తెలిపారు. 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top