
సాక్షి, ముంబై : 2019 ఏడాదికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ రిపబ్లిక్ డే సేల్ షురూ కానుంది. జనవరి 20నుంచి 22వరకు ఆఫర్ సేల్ నిర్వహించబోతోంది ఫ్లిప్‌కార్ట్. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బొమ్మలు లాంటి కేటగిరీల్లో ఆకర్షణీయమైన ఆఫర్లు కొనుగోలుదారులను ఊరించనున్నాయి. షావోమీ, హానర్, ఏసుస్, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై మంచి ఆఫర్లు లభ్యం కానున్నాయి.
ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్పై 80శాతం వరకు, టీవీలు, అప్లయెన్సెస్‌పై 75 శాతం వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్స్‌పై 70 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అంతేకాదు 3 వస్తువులు కలిపి కొంటే 10శాతం, 4 వస్తువులు కలిపి కొంటే 15 శాతం తగ్గింపు ఆఫర్లున్నాయి.ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోళ్లపై 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. వీటితోపాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
రష్ హవర్ సేల్
రష్ హవర్స్‌లో ఎక్స్‌ట్రా డిస్కౌంట్స్ అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ప్రతీరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 6గంటల వరకు 26 శాతం అదనపు డిస్కౌంట్‌తో వస్తులను కొనుగోలు చేయవచ్చు. జనవరి 20 అర్థరాత్రి రెండు గంటల వరకు స్పెషల్ సేల్ ఉంటుంది. ఇంకా రూ.1,450 కొనుగోలుపై 10 శాతం, రూ.1950 కొనుగోలుపై అదనంగా 5శాతం తగ్గింపు లభిస్తుంది. ప్రతీ 8గంటలకోసారి బ్లాక్ బస్టర్ డీల్స్ రీఫ్రెష్ అవుతాయి. జనవరి 20 నుంచి 22 వరకు జరిగే సేల్ వివరాలు, ఆయా ఆఫర్లు తదితర వివరాలు ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్, యాప్‌లో లభ్యం.