రెలిగేర్‌ సెక్యూరిటీస్‌ను కొనేసిన ఎడిల్‌వీస్‌ | Edelweiss Wealth Management acquires Religare's securities | Sakshi
Sakshi News home page

రెలిగేర్‌ సెక్యూరిటీస్‌ను కొనేసిన ఎడిల్‌వీస్‌

Dec 20 2017 11:19 AM | Updated on Apr 3 2019 8:42 PM

Edelweiss Wealth Management acquires Religare's securities - Sakshi

సాక్షి, ముంబై:  ఎడిల్‌ వీస్‌ వెల్త్ మేనేజ్‌మెంట్‌ రెలిగేర్‌ సెక్యూరిటీస్‌ బిజినెస్‌ను కొనుగోలు చేసింది.  డిపాజిటరీ పార్టిసిపెంటరీ సర్వీసెస్‌ సహా  సెక్యూరిటీస్‌,  కమోడిటీ బ్రోకింగ్‌  వ్యాపారాన్ని కొనుగోలు చేసినట్టు ఎడిల్‌వీస్‌ బుధవారం ప్రకటించింది.

ఈ డీల్‌తో రెలిగేర్‌కు చెందిన సెక్యూరిటీ బిజినెస్‌లో భాగంగా కమోడిటీస్‌ బ్రోకింగ్‌, డిపాజిటరీ పార్టిసిపెంట్‌ సర్వీసులను సైతం ఎడిల్‌వీస్‌ దక్కించుకోనుంది. ఈ డీల్‌ ద్వారా తమ గ్రోత్‌ ప్లాన్స్‌  మరింత ఆకర్షణీయంగా మారనున్నాయని  ఎడిల్‌వీస్ గ్రూప్ గ్లోబల్ వెల్త్ అండ్ అసెట్ మేనేజ్మెంట్,  సీఈవో నితిన్ జైన్ చెప్పారు. తమ క్లయింట్ బేస్ దాదాపు మూడు రెట్లు పెరుగుదలకు సహాయం చేస్తుందన్నారు. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కొనుగోలు విషయాన్ని వెల్లడించడంతో ఈ రెండు కౌంటర్లూ వెలుగులోకి వచ్చాయి. బీఎస్ఈలో రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 5 శాతం లాభపడగా,  ఎడిల్‌వీస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 1.27 శాతం లాభాలతో కొనసాగుతోంది.   

కాగా గతంలో ఎడెల్‌ వీస్‌ వెల్త్ మేనేజ్మెంట్ రూష్నిల్ సెక్యూరిటీస్ (2001) ,  అనాగ్రాం క్యాపిటల్ లిమిటెడ్ (2010) ను కొనుగోలు చేసింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement