డిస్నీ చేతికి ఫాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ వ్యాపారం

Disney owns after the massive Disney/Fox merger - Sakshi

డీల్‌ పూర్తి; విలువ 7,100 కోట్ల డాలర్లు

లాస్‌ఏంజెల్స్‌: ట్వంటీ ఫస్ట్‌ సెంచురీ ఫాక్స్‌ కంపెనీ ఎంటర్‌టైన్మెంట్‌ వ్యాపారాన్ని డిస్నీ కంపెనీ చేజిక్కించుకుంది. ఈ డీల్‌ విలువ 7,100 కోట్ల డాలర్లు మేర ఉంటుంది. ఒప్పందంలో భాగంగా ఫాక్స్‌ సంస్థకు చెందిన ఫిల్మ్, టీవీ స్టూడియో, ఎఫ్‌ఎక్స్, నేషనల్‌ జాగ్రఫిక్, హులు స్ట్రీమింగ్‌ సర్వీస్‌లో ఫాక్స్‌కు ఉన్న 30 శాతం వాటా, స్టార్‌ ఇండియాలపై హక్కులు డిస్నీకి లభిస్తాయి. ఈ కంపెనీ చేజిక్కిన ఫలితంగా డీస్నీ సంస్థ, డిస్నీ ప్లస్‌ పేరుతో అందించనున్న  స్ట్రీమింగ్‌ సర్వీస్‌  ఈ ఏడాదే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి టెక్నాలజీ కంపెనీలకు గట్టిపోటీనివ్వడానికి ఈ డీల్‌ డిస్నీకి దోహదం చేయనున్నదని అంచనా.  

ఇది అసాధారణమైన, చారిత్రాత్మక డీల్‌ 
ఇది ఒక అసాధారణమైన, చారిత్రాత్మక ఘటన అని వాల్ట్‌ డిస్నీ కంపెనీ చైర్మన్, సీఈఓ రాబర్ట ఐగర్‌ వ్యాఖ్యానించారు.  కాగా డిస్నీ, ఫాక్స్‌ రెండు కంపెనీలు సినిమాలు తీసే రంగంలోనే ఉండటంతో ఇరు సంస్థల్లో 4,000 ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ డీల్‌తో వార్నర్‌ బ్రదర్స్, యూనివర్శల్, సోనీ పిక్చర్స్, పారమౌంట్‌ పిక్చర్స్, డిస్నీ... ఈ 5 పెద్ద స్టూడియోలే హాలీవుడ్‌లో మిగులుతాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top