ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో చిదంబరానికి ఊరట

Court Extended Interim Protection To Chidambaram In Aircel Maxis Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ కేసులో అరెస్ట్‌ కాకుండా కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబారానికి మంజూరు చేసిన మధ్యంతర ఊరటను ఢిల్లీ కోర్టు గురువారం ఈ నెల 9 వరకూ పొడిగించింది. కేసును విచారిస్తున్న సీబీఐ, ఈడీలు ఎప్పుడు సమన్లు జారీ చేసినా చిదబంరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం విచారణకు హాజరవుతారని వారి న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టుకు నివేదించారు.

చిదంబరం మార్చి 2006లో కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిబంధనలకు విరుద్ధంగా ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఎఫ్‌డీఐకి ఆమోద ముద్ర వేశారని దర్యాప్తు సంస్ధలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదించాల్సి ఉండగా, చిదంబరం ఆర్థిక మంత్రి హోదాలో విదేశీ సంస్ధకు ఎఫ్‌ఐపీబీ కోసం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సీబీఐ ఆరోపిస్తోంది. రూ 3500 కోట్ల ఎయిర్‌సెల్‌-మ్యాక్సిస్‌ ఒప్పందంతో పాటు రూ 305 కోట్ల ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులోనూ దర్యాప్తు సంస్ధలు చిదంబరం పాత్రపై దర్యాప్తు సాగిస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top